twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్‌పై నోరుపారేసుకొన్న వడివేలు.. గడ్డిపెట్టిన ప్రముఖ డైరెక్టర్

    |

    ప్రముఖ దర్శక, నిర్మాత శంకర్, హాస్యనటుడు వడివేలు, దర్శకుడు చెంబు దేవన్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో నడిగర సంఘం తదితర సంఘాల దృష్టికి ఈ వివాదం వెళ్లింది. అయితే నిర్మాతల సంఘం కూడా ఈ వివాదంపై స్పందించారు. తాజాగా దర్శకుడు చెంబు దేవన్‌పై వడివేలు అభ్యంతరకరంగా చేసిన కామెంట్లపై దర్శక, నిర్మాత వెంకట్ ప్రభు మండిపడ్డారు. ఈ వివాదానికి సంబంధించిన వివాదంలోకి వెళ్తే..

    వడివేలు వివాదం గురించి

    వడివేలు వివాదం గురించి

    కమెడియన్‌గా రాణిస్తున్న రోజుల్లో హింసించే రాజు 23వ పులకేశి చిత్రంలో వడివేలును హీరోగా పెట్టి చింబు దేవన్ సినిమా తీయగా, దానికి శంకర్ నిర్మాతగా వ్యవవహరించారు. ఆ తర్వాత 11 ఏళ్లకు దానికి సీక్వెల్‌గా 24వ పులకేశి చిత్రాన్ని ప్రారంభించారు. కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు, వడివేలు డేట్స్ ఇవ్వకపోవడం వల్ల సినిమా ఆగిపోయింది.

    దర్శకుడు శంకర్, దేవన్‌పై దురుసుగా

    దర్శకుడు శంకర్, దేవన్‌పై దురుసుగా

    24వ పులకేశీ ఆగిపోయిన తర్వాత వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వడివేలు మాట్లాడుతూ... శంకర్ ఓ గ్రాఫిక్ డైరెక్టర్.. చెంబు దేవన్ ఓ అసమర్ధుడు అని కామెంట్ చేశాడు. శంకర్, చింబు దేవన్‌పై వడివేలు చేసిన కామెంట్లపై సముద్రఖని, నవీన్, విజయ్ మిల్టన్ లాంటి దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెరీర్‌లో మంచి స్థానాన్ని ఇచ్చిన దర్శకులను ఉద్దేశించి కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టారు.

    వడివేలుపై వెంకట్ ప్రభు ఫైర్

    వడివేలుపై వెంకట్ ప్రభు ఫైర్

    తాజాగా వడివేలు కామెంట్లపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందిస్తూ.. దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. అలాంటి వారికి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే దర్శకుడిని తప్పుపడుతారు. నీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాను ఇచ్చిన దర్శకులపై అలా మాట్లాడకూడదు అని అన్నారు.

    మీకు ఎందుకింత విద్వేషం

    మీకు ఎందుకింత విద్వేషం

    వడివేలు వ్యాఖ్యలపై ఆగ్రహం చేస్తూ.. చింబు దేవన్ కేవలం మంచి దర్శకుడే కాదు. మంచి మనిషి కూడా. ఇక శంకర్ ప్రతిభ, వ్యక్తిత్వం గురించి కొత్తగా చెప్పేది ఏమిలేదు. తమిళ సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన అతడిని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి. ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఒకరిపై అంత విద్వేషం ఎందుకు అని అన్నారు.

    English summary
    Venkat Prabhu is the latest director to slams Vadivelu for making distasteful remarks about 2.0 director Shankar and director Chimbu Deven. As per report, Vadivelu called Shankar, a 'graphics director' and said that Chimbu Deven was incompetent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X