Vetrimaaran: స్టార్ హీరోలకు వెట్రిమారన్ పంచ్ .. ఇకనైనా దారికి వచ్చేనా !
Vetrimaaran: గతంలో ఏ మూవీ విడుదలవుతున్న మూవీ లవర్స్ సందడి మామూలుగా ఉండేవి కాదు. మూవీ విడుదలైన ఫస్ట్ షో కో.. లేదా ఫస్ట్ రోజు నాడో సినిమా చూడాల్సిందే. ఇక అభిమాన హీరో సినిమా అయితే.. ఆ రేంజే వేరు. ఈ మూవీని ఫ్యాన్స్ సొంతం చేసుకొని తమ అభిమాన హీరోల కటౌట్లు పెట్టడం, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేయడం. థియోటర్ సినిమా నడిచినని రోజులు జాతర చేయాల్సిందే. కానీ, కరోనా తర్వాత సినిమాలు, థియేటర్ల మార్కెంటింగ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్ డౌన్ తరువాత ఓటీటీ హావా పెరుగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌పై విడుదలయ్యే సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. థియోటర్లో సినిమా చూసేవారికి కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్ మూవీస్ థియేటర్‌లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. థియేటర్‌లలో సినిమాలు విడుదలవుతున్న రెండు లేదా మూడు వారాల్లో ఓటీటీలో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఈ తరుణంలో మూవీ మేకర్స్ నష్టాలు ఎదుర్కొవల్సి వస్తుంది.
ఇదెలా ఉంటే.. ఇండస్ట్రీలోని అగ్రహీరోలు కోట్ల రూపాయాల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కొంత మంది స్టార్ అయితే ఒక్కొక్క సినిమాకు రూ. 100 కోట్లు వరకు తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తే ప్రొడక్షన్ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీయాలని ప్రయత్నించినా పాజిబుల్ అవ్వట్లేదు. హై రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోస్ పై స్టార్ దర్శకుడు వెట్రిమారన్ షాకింగ్ కామెంట్లు చేశారు.

తాజాగా ప్రముఖ సినీ ఆంగ్ల మ్యాగజైన్ నిర్వహించిన 'డైరెక్టర్స్ అన్‌కట్' అనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్స్ వెట్రిమారన్ తోపాటు కరణ్ జోహార్, పా రంజిత్, జోయా అక్తర్, మహేష్ నారాయణ్ పలువురు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో చిత్రాలకు పెరిగిన బడ్జెట్ లపై తీవ్రంగా చర్చించారు. అగ్ర హీరోలు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని మాట్లాడారు. తమ మార్కెట్ పరిధిని మించి డిమాండ్ చేయడం సరికాదని చర్చించారు. కాగా హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన అభిప్రాయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు.
తర్వాత దర్శకుడు వెట్రిమారన్ హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని థియేట్రికల్ బాక్సాఫీస్ ఫెయిల్ అని చెప్పలేమనీ, ఇది ఓటీటీ సృష్టించిన మాయాజాలమన్నారు. కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులను ఓటీటీ సంస్థలు తమకు అనువుగా మార్చుకున్నాయన్నారు. అగ్రహీరోలతో మూవీస్ చేస్తే 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయలు చెల్లించాలి. దీంతో బడ్జెట్ కూడా అమాంతం పెరుగుతోంది. అలాగే రెమ్యూనరేషన్లు కూడా. అయితే కొన్ని నెలలకే అది సరైనది కాదని ఓటీటీ వేదికలుకూడా తెలుసుకుంటున్నాయి. లేట్ గా విడుదల చేస్తే.. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని ఓటీటీలు కూడా చేతులు ఎత్తేస్తే ప్రొడ్యూసర్లుకు నష్టం జరుగుతుంది.

మొదట్లో రజనీకాంత్, విజయ్ వంటి అగ్ర హీరోల మూవీస్‌కు ఓటీటీ సంస్థలు రూ.120 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవి. కానీ సడెన్ గా తప్పుకుంటే నిర్మాతలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటూ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ అగ్ర హీరోల పారితోషికం పై సంచలన కామెంట్లు చేశాడు. కాగా హీరోలు పారితోషికం తగ్గించుకుంటే ప్రొడ్యూసర్లకు కాస్త లాభం చేకూరుతుందని అన్నారు. రెమ్యునరేషన్ తగ్గించడం వల్ల నిర్మాతలతో పాటు ఇండస్ట్రీకి కూడా ప్రాఫిట్ అని వెట్రిమారన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మున్ముందు మూవీస్ ను బతికించుకోవాలంటే తప్పకుండా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో థియేటర్ల వద్ద టికెట్ల ధరలు కూడా తగ్గించాలని డైరెక్టర్స్ చర్చించారు.


Click it and Unblock the Notifications











