twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెజవాడ హీరోయిన్ కి డైరక్టర్ ప్లాట్ గిప్ట్...

    By Srikanya
    |

    బెజవాడ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అమలా పౌల్. ఆమెకు దర్శకుడు విజయ్ యాభై లక్షలు విలువ చేసే ప్లాట్ ని గిప్ట్ గా ఇచ్చాడని సమాచారం. ఆ ప్లాట్ చెన్నై లోని అంటూ ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఓ కథనం ప్రచురించి హాట్ టాపిక్ కి తెరతీసింది. దర్శకుడు విజయ్ ఆమెతో గతంలో నాన్న చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్ హీరోగా రూపొందిన ఆ చిత్రంలో అమల పౌల్ ఓ కీ రోల్ ని చేసింది. ఆ చిత్రంతోనే ఆమె పాపులర్ అయ్యి మరిన్ని అవకాశాలు పొందింది. ఇక ఆమెకు నాన్న రిలీజైన ఇన్నాళ్లుకు ఎందుకు గిప్ట్ గా ఇచ్చాడు అంటూ ఇప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా విజయ్ కీ,అమలా పౌల్ కీ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ చెన్నైకి చెందిన కొన్ని పత్రికలు రాస్తూ వస్తున్నాయి. అయితే ఈ సంఘటనతో ఆ గాసిప్స్ కి ఓ ఆధారం దొరికినట్లైంది. విజయ్ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న దర్శకుడు.

    మద్రాసిపట్టణంతో పాపులర్ అయిన ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని సైతం విక్రమ్ తోనే చేస్తున్నాడు. అందులో అమలా పౌల్ నే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బెజవాడ హిట్టైతే ఆమెకు తెలుగులో పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్స్ వచ్చేవి. అయితే బెజవాడ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. దాంతో ఆమెకు విజయ్ ఇచ్చే ఆఫర్స్ పైనా,అతను రికమెండ్ చేసే హీరోలతో తెచ్చే ఆఫర్స్ పైనే ఆధారపడే పరిస్దితి ఉంది. ప్రస్తుతం ఆమె విజయ్ తో రిలేషన్ కొనసాగిస్తూ పరిశ్రమలో తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకోవాల్సిన పరిస్ధితి ఉందని చెన్నై సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక విజయ్ గతంలో పాపులర్ ఏడ్ ఫిల్మ్ మేకర్. దాంతో అతను తను చేసే యాడ్స్ లో సైతం ఆమెనే రికమెండ్ చేస్తూ ఆమెకు కెరీర్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

    English summary
    Tamil Film Director Vijay bought Amala a swanky Rs 50 lakh flat in the suburbs of Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X