ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ఆకస్మిక మరణంతో విషాదంలో సినీలోకం
ప్రముఖ నటుడు దర్శకుడు, సినీ రచయి విసు ఇక లేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన చెన్నైలో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణం సినీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

విసు అసలు పేరు
విసు అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాధన్. ఆయనను ముద్దుగా విసు పిలుచుకొనే వారు. 1945 జూలైలో జన్మించిన ఆయన వయసు 75 సంవత్సరాలు. తెలుగు సినిమా పరిశ్రమకు దాదాపు 30 ఏళ్లకుపైగా సేవలందించారు. వెండితెర, టెలివిజన్‌పై కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు.

కుటుంబ కథా చిత్రాలతో
సంసారం ఒక చదరంగం, చిదంబర రహస్యం, ఆడదే ఆధారం లాంటి చిత్రాలను రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 50కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వం చేపట్టారు. పలు సినిమాలకు మాటలు రాశారు. ఆయన సినిమాల్లో సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు ఎక్కువగా కనిపించేవి.

రాజకీయాల్లోకి
సినిమాల నుంచి దూరమైన తర్వాత 2016లో ఆయన బీజేపీలో చేరారు. జాతీయభావం, ఆధ్యాత్మికభావం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. కానీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేకపోయారు. వయసుపై బడటంతో పార్టీకి పెద్దగా సేవలు అందించలేకపోయారని సన్నిహితులు చెప్పుకొంటారు.
Recommended Video

రాధిక, పలువురు సంతాపం..
ఆయన మృతి వార్తను తెలుసుకొన్న వెంటనే పలువురు సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చేసిన సేవలను స్మరించుకొన్నారు. ఆయన మరణం ఎవరూ పూడ్చలేని లోటు అంటూ రాధిక శరత్ కుమార్, శంతను భాగ్యరాజా తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











