18 ప్లస్: శ్రీరెడ్డి బ్యాగులో ఇండస్ట్రీని వణికించే ఆయుధం, అలాంటోడు దొరికితే...!

Recommended Video

Sri Reddy Handbag Secrets : Directors And Heroes Life Is In Pen Drive | Filmibeat Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేసిన శ్రీరెడ్డి.... ఫిల్మ్ చాంబర్ ముందు నగ్న ప్రదర్శన చేయడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై షిప్ట్ అయ్యేలా చేశాయి. తమిళంలో వరుస సినిమా అవకాశాలు కూడా వస్తుండటంతో అక్కడే సెటిలైంది ఈ వివాదాస్పద నటి.

తాజాగా ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి తన హ్యాండ్ బ్యాగులో ఏమున్నాయనే విషయాలు వెల్లడించారు. అందులో నుంచి కొన్ని ఊహించని వస్తువులు సైతం బయటకు రావడం వీక్షకులను సైతం ఆశ్చర్య పరిచింది.

నువ్వు 18 ప్లస్ అయితేనే

నువ్వు 18 ప్లస్ అయితేనే

తాను వాడుతున్న బ్యాగ్ ‘మైఖేల్ కోర్స్' బ్రాండ్ అని, యూఎస్ఏలో దీన్ని కొనుగోలు చేసినట్లు శ్రీరెడ్డి వెల్లడించారు. నువ్వు 18 ప్లస్ అయితేనే నా బ్యాగ్ చూడటానికి అర్హుడివి అంటూ శ్రీరెడ్డి యాంకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం.

బ్యాగులో ఏమున్నాయి?

బ్యాగులో ఏమున్నాయి?

శ్రీరెడ్డి హ్యాండ్ బ్యాగులో ఫోన్, సన్ స్కీన్ లోషన్, మొబైల్ చార్జర్, సన్ గ్లాసెస్, ఒడోమస్, వాచ్, ఇయర్ ఫోన్స్, దుర్గామాత కుంకుమ, దేవుడి గుర్తుతో ఉన్న డాలర్, సేఫ్టీ పిన్స్, మేకప్ లోషన్, ఇంటి తాళాలు, కారు కీస్... లాంటి వస్తువులు ఉన్నాయి.

బ్యాగులో నుంచి అసలు బాంబు తీసిన శ్రీరెడ్డి

బ్యాగులో నుంచి అసలు బాంబు తీసిన శ్రీరెడ్డి

తన బ్యాగులో నుంచి వస్తువులన్నీ తీసిన తర్వత శ్రీరెడ్డి అసలు సిసలైన బాంబును బయటకు తీసింది. అది మరేంటో కాదు.. పెన్ డ్రైవ్. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతల లైఫ్ ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని శ్రీరెడ్డి తెలిపారు.

 శ్రీరెడ్డి చేష్టలతో ఖంగుతిన్న యాంకర్

శ్రీరెడ్డి చేష్టలతో ఖంగుతిన్న యాంకర్

మేల్ యాంకర్ కాస్త ఎక్స్ ట్రా యాటిట్యూడ్ ప్రదర్శిస్తుంటే .. నీకు కూడా ఈ పెన్ డ్రైవ్‌లోకి రావాలని ఉందా? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. దీంతో కంగారు పడ్డ సదరు యాంకర్ తనకు అక్కడి వరకు రావాలనే ఆశ లేదని, తాను ఇక్కడే ఉంటానంటూ స్పష్టం చేశారు.

ధనుష్ అంటే...

ధనుష్ అంటే...

బ్యాగులో ఇయర్ ఫోన్స్ చూసిన యాంకర్... నీకు ఎవరి పాటలు అంటే ఇష్టమని ప్రశ్నించాడు. ‘నాకు ధనుష్ పాటలు అంటే ఇష్టం. వై దిస్ కొలవెరీ బాగా నచ్చింది' అని శ్రీరెడ్డి సమాధానం ఇచ్చింది.

బాయ్ ఫ్రెండ్ దొరకలేదు

బాయ్ ఫ్రెండ్ దొరకలేదు

ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఇంకా బాయ్ ఫ్రెండ్ దొరకలేదని శ్రీరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమిళం నేర్పే టీచర్‌లా, స్నేహితుడిలా, ప్రేమికుడిలా ఉండే మచ్చా కోసం ఎదురు చూస్తున్నానని, అతడు నా గతాన్ని యాక్సెప్ట్ చేసేవాడై ఉండాలన్నారు.

అలాంటి వాడు భర్తగా దొరికొతే ఇండస్ట్రీని వదిలేస్తా

అలాంటి వాడు భర్తగా దొరికొతే ఇండస్ట్రీని వదిలేస్తా

చాలా మంది తమిళులు తమ భార్య నటిగా ఉండాన్ని ఇష్టపడరు. నాకు మంచి భర్త దొరికితే తాను నటనను వదిలేయడానికి సిద్ధమే అని శ్రీరెడ్డి తెలిపారు. ప్రతి రోజు నన్ను బుజ్జి, చిట్టి, బంగారం అంటూ ప్రేమగా చూసుకునే వాడు భర్తగా కావాలని శ్రీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X