ఐసీయూలో విజయ్‌కాంత్.. కెప్టెన్ ఆరోగ్యంపై డీఎండీకే అధికార ప్రకటన
ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త విజయ్‌కాంత్ అనారోగ్యంతో చెన్నైలోని హాస్పిటల్‌లో చేరడం అభిమానులు, సినీ ప్రేక్షకులను, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. బుధవారం ఉదయమే ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో చేర్పించినట్టు తమిళ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అని కథనంలో పేర్కొన్నారు.
విజయ్‌కాంత్ దీర్ఘ కాలంగా పలు రకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. అయితే ఊహించిన విధంగా మళ్లీ ఆరోగ్య సమస్య తలెత్తడంతో హాస్పిటల్‌లో చేర్పించారు.

అయితే విజయ్‌కాంత్ ఆరోగ్యంపై తన పార్టీ డీఎండీకే అధికారికంగా ప్రకటన విడుదల చేసి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ బాడీ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్‌లో చేరారు. కొద్ద రోజుల్లో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతారు అని ప్రకటనలో పేర్కొన్నారు.
విజయ్‌కాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదు అంటూ డీఎండీకే పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆనందాన్ని క్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











