Vijayakanth No More: సినీ రంగంలో పెను విషాదం.. స్టార్ హీరో కన్నుమూత

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో వరుసగా పెను విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని సినీ రంగాల్లో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నట శిఖరం నేలకొరిగింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే సౌతిండియాలో నటుడిగా సత్తా చాటి కోలీవుడ్ సీనియర్ హీరో కెప్టెన్ విజయకాంత్ (71) కాసేపటి క్రితమే తుది శ్వాసను విడిచారు.

Recommended Video

RIP Captain Vijaykanth విజయ్ కాంత్ Lifestory వింటే కన్నీళ్లు ఆగవు.. | FilmiBeat Telugu

సీనియర్ హీరో కెప్టెన్ విజయకాంత్ కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పలుమార్లు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటోన్న సమయంలోనే ఆయన పరిస్థితి విషమించింది. దీంతో గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో విజయకాంత్ తుదిశ్వాసను విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.

DMDK party founder and Senior Hero Vijayakanth Passes Away Due to Health Issues

కోలీవుడ్ సీనియర్ హీరో కెప్టెన్ విజయకాంత్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయకాంత్ మరణంపై పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయకాంత్ వయసు 71 ఏళ్ళు. ఆయనకు భార్య ప్రేమలత, ఇద్దరు పిల్లలు షణ్ముగ పాండియన్, విజయ్ ప్రభాకర్‌ ఉన్నారు.

ఇక, విజయకాంత్ 27 ఏళ్ల వయసులో 'ఇనిక్కుమ్ ఇలమై' అనే సినిమాతో నటుడిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి 150కి పైగానే సినిమాల్లో ఆయన నటించారు. వీటిలో ఎక్కువ శాతం సందేశాత్మకమైన, విప్లవాత్మకమైన కథలతో మూవీలు చేశారు. దాదాపు 20 సినిమాలో విజయకాంత్ పోలీసు పాత్రల్లో నటించారు. 1984లో ఏకంగా 20 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఇలా ఆయన కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా 2015లో 'సగప్తమ్' మూవీలో కనిపించారు.

DMDK party founder and Senior Hero Vijayakanth Passes Away Due to Health Issues

విజయకాంత్ 2005 సెప్టెంబరు 14న దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (DMDK) పార్టీని స్థాపించారు. ఈ క్రమంలోనే 2006 ఎన్నికల్లో ఆయన పార్టీ తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ, విజయకాంత్ మాత్రమే గెలిచారు. ఆ తర్వాత 2011లోనూ కెప్టెన్ విజయం సాధించారు. కానీ, 2016 ఎన్నికల్లో మాత్రం ఆయన డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X