'రావణ్' నిలబెట్టాలని విక్రమ్ పడరాని పాట్లు
మణిరత్నం దర్శకత్వంలో ఎంతో హైప్ తో రిలీజ్ చివరకు ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్న రావణ్ చిత్రం ప్రమోషన్ భాద్యతను ఆ చిత్రం హీరో విక్రమ్ తన భుజాన వేసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ చిత్రం ఎవరికి వారే చూసి జడ్జిమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొందరికి నచ్చుతోంది.మరికొందరకు ఎక్కట్లేదు. కాబట్టి సినిమా చూడ్డానికి వెళ్ళేవారు రావణ్ గురించి ఎవరేం చెప్పినా వినొద్దు. దయచేసి మీ అంతట మీరే ధియోటర్ కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉందనే నిర్ణయానికి రండి అన్నారు విక్రమ్.
ఇక అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవద్దు. వాటిని ఆయన పర్శనల్ వ్యూస్ గా భావిస్తున్నాను. అలాగే మణిరత్నం ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేయటానకి చాలా కష్టమైన దట్టమైన అడవుల్లో..లొకేషన్స్ లో ఓ పొయిట్రీలా చిత్రీకరించారు. ఇక తమిళ్ వెర్షన్ బాగా అడుతోంది. హిందీవారికి ఈ ధీమ్ కి కనెక్టు కాలేదు. ఇక పోలీస్ అధికారిగా నటించిన పృధ్వీరాజ్ మాట్లాడుతూ...తాను ఈ చిత్రంలో చేయటం గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











