Jailer మ్యూజిక్ డైరెక్టర్‌కు ఖరీదైన కారు..అనిరుధ్‌కు కళానిధి మారన్ ఇచ్చిన కారు ఎన్ని కోట్ల రూపాయలతో తెలుసా?
జైలర్ చిత్రం రజనీకాంత్ ఫ్యాన్స్, సినీ అభిమానుల్లోనే కాకుండా సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అమితమైన సంతోషాన్ని, వెలకట్టలేని అనుభూతిని నింపింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. దాంతో ఈ సినిమా నిర్మాత కళానిది మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిపై అభిమానాన్ని చాటుకొంటున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఖరీదైన, విలాసవంతమైన కారును గిఫ్టుగా అందజేశారు. ఆ కారు బ్రాండ్ ఏమిటి? దాని విలువ ఎంతంటే?
జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 (BMW X7 Car) కారును బహుకరించాడు. నిర్మాత కళానిధి మారన్ రెండు ఖరీదైన కార్లు.. 1.95 కోట్ల విలువైన BMW i7, 1.24 కోట్ల ఖరీదైన BMW x7 కార్లను రజనీ ముందు కళానిధి మారన్ ఉంచారు. అయితే తన ముందు ఉంచిన ఖరీదైన కారును కాకుండా తక్కువ విలువ ఉన్న కారును రజనీ ఎంచుకొన్నాడు. ఆ తర్వాత రజనీకి కళానిధి మారన్ కారు తాళాలు అప్పగించారు.

ఇదిలా ఉండగా, జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు కూడా నిర్మాత కళానిధి మారన్ ఖరీదైన కారును బహుకరించాడు. నెల్సన్‌ను పిలిచి బ్రాండ్ న్యూ పోర్సే కారును బహుకరించాడు. దీని విలువ సుమారు 1.5 కోట్లకుపైగానే ఉంటుందని తెలిసింది. ఇలా కళానిధి మారన్ తన సక్సెస్‌లో భాగమైన రజనీకాంత్, నెల్సన్‌తో తన సంతోషాన్ని పంచుకొన్నారు.

కళానిధి మారన్ అంతటితో ఆగలేదు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్‌కు కూడా భారీ బహుమతిని అందించారు. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ భారీ చెక్‌ను అందజేశారు.అంతేకాకుండా పోర్చే కారును కూడా బహుమతిగా అందజేశారు. కొత్త కారును తన ఆఫీస్ ముందు ఉంచి అనిరుధ్‌కు సర్‌ప్రైజ్ చేశారు.
తన కోసం తెచ్చి పోర్చే కారును చూసి అనురుధ్ ఆనందంలో మునిగిపోయాడు. వెంటనే కళానిధి మారన్ తన చేతిలో ఉన్న కారు తాళాలను అనిరుధ్‌కు అందజేశారు. అనంతరం కారు డోరు తీసి డ్రైవర్ సీట్‌లో కూర్చొని కొన్ని క్షణాలు అనంద, అనుభూతులను ఆస్వాదించాడు. ఆ తర్వాత వచ్చి కళానిధి మారన్‌తో ఫోటో దిగాడు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కు కళానిధి మారన్ ఇచ్చిన విలాసవంతమైన పోర్చే (Porsche) కారు ధర సుమారుగా 1.5 కోట్ల నుంచి 2 కోట్లకుపైగానే ఉంటుంది. పోర్చే కారు ఎక్స్ షోరు ధర 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇలాంటి ఖరీదైన గిఫ్టులతో జైలర్ టీమ్‌ను ఆనందంతో ముంచెత్తారు.


Click it and Unblock the Notifications











