శింబు తెలుగు రాష్ట్రాలకు విరాళం.. పవన్ కళ్యాణ్ కనెక్షన్ ఏంటో తెలుసా?

ఇప్పుడు మన తెలుగు సినిమాకి చెందిన అనేక స్టార్స్ పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర భారీ స్టార్డం ను చూసిన బిగ్ స్టార్స్.. వారి తర్వాత వచ్చిన హీరోలు కూడా ఇప్పుడు వారిని మించి పాన్ ఇండియా సిన్మాలు చేసేస్తున్నారు. దీనితో ఈ స్టార్స్ వెనుకబడ్డారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఆ బిగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి లేట్ గా వెళ్తున్నారు. మరి ఆ హీరోలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు అని చెప్పాలి.

ఈ ఇద్దరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్నవాళ్లే కానీ తమ క్రేజ్ ను పాన్ ఇండియా వైడ్ ఇంకా విస్తరించలేదు. మరి ఫైనల్ గా ఇపుడు ఆ రేంజ్ సినిమాలు వారు చేస్తున్నారు. కాగా పవన్ ఆల్రెడీ రెండు భారీ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా అనౌన్స్ చేసి చేస్తుండగా ఈ చిత్రాల్లో యువ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం "ఓజి" కూడా ఒకటి.

Do you know actor simbu given donation for Telugu States

మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ షూటింగ్ మాత్రం చాలా కాలం నుంచి బ్రేక్ పడి ఆగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగ్ కావచ్చు అనే రూమర్స్ కూడా వినిపిస్తుండగా సుజీత్ భారీ లెవెల్లో ఈ సినిమాకి ప్లానింగ్ చేస్తున్నాడు. తెలుగు సహా హిందీ మార్కెట్ తమిళ్ నుంచి కూడా పలువురు స్టార్స్ ని ఈ సినిమా కోసం తీసుకున్నాడు.

అయితే లేటెస్ట్ గా కోలీవుడ్ కి చెందిన మరో స్టార్ నటుడు కూడా ఈ చిత్రంలో భాగం కాబోతున్నాడు అని కొన్ని గాసిప్స్ వినిపించాయి. కాగా ఆ నటుడే శింబు కాగా తాను ఈ సినిమా కోసం ఓ సాంగ్ ని పడనున్నాడు అని టక వచ్చింది. అయితే సంగీత దర్శకుడు థమన్ తో ఆల్రెడీ ఇది వరకు కూడా శింబు పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి ఓజి కోసం పవర్ఫుల్ సాంగ్ ని ప్లాన్ చేసినట్టుగా టాక్ వచ్చింది.

Do you know actor simbu given donation for Telugu States

మరి ఇందుకు గాను శింబుకి 6 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా మేకర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కానీ శింబు ఈ రెమ్యునరేషన్ ని తీసుకోలేదట. ఈ మొత్తాన్ని తాను తెలుగు రాష్ట్రాల సహానిధికి ఇచ్చేశాడట. తెలుగు స్టేట్స్ లో వరదలు కారణంగా అనేమంది నటీనటులు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే శింబు కూడా పవన్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల సహాయ నిధులకే ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది.

దీనితో శింబు విషయంలో తెలుగు రాష్ట్రాల జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్ ఓజి సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ భారీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X