Vijayakanth సినిమా కథను తలపించే విజయ్‌కాంత్ లవ్ స్టోరి మీకు తెలుసా? ఆయన భార్య ఎవరంటే?
తమిళ సూపర్‌స్టార్, దేశియ మురుపొక్కు ద్రావిడ కజగం (డీఎండీకే) అధినేత విజయ్‌కాంత్ ఇకలేరు. పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీ తెల్లవారు జామున చెన్నైలోని మియాట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణవార్త బయటకు రాగానే ఫ్యాన్స్ భారీ ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకొన్నారు. ఇలాంటి శోక సమయంలో ఆయన జీవితంలో లవ్ స్టోరి మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

విజయ్‌కాంత్‌కు ప్రేమలత విజయ్‌కాంత్‌తో 1990 జనవరి 31వ తేదీన వివాహం జరిగింది. వారిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో షణ్ముఖ పాండ్యన్ నటుడిగా రాణిస్తున్నారు. అయితే ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్ భార్య ప్రేమలత చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.

తమిళ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రేమలత మాట్లాడుతూ.. మాది సంప్రదాయంగా పెద్దలు కుదిర్చిన సంబంధం. మా ఇద్దరి కలయిక స్వర్గంలోనే కుదిర్చారనే భావన కలుగుతుంది. మా మధ్య బంధాన్ని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కెప్టెన్ విజయ్‌కాంత్ మధురైకి చెందిన కుటుంబం. మేము వెల్లూరులో స్థిరపడిన ఫ్యామిలీ. రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదు అని చెప్పారు.
పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి చూపుల కోసం తొలిసారి మా ఇంటికి విజయ్‌కాంత్ వచ్చారు. ఆయన ప్రవర్తన చూసి మా నాన్న వెంటనే ఇంప్రెస్ అయ్యారు. నా కూతురుకు ఈయనే భర్త అని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఓ హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేశారు అని ప్రేమలత విజయ్‌కాంత్ చెప్పారు.

విజయ్‌కాంత్ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి కాషాయ రంగు దస్తులు, తెల్లటి షూస్ ధరించి వచ్చారు. ఆ సమయంలో ఆయన అయ్యప్ప మాలలో ఉండి శబరిమలైకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు. ఆయన గురించి పెద్దగా తెలియకపోయినా ఆయన బిహేవియర్ చూసి నాతో పెళ్లికి ఒప్పుకొన్నారు. పెళ్లిచూపుల తర్వాత పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. పెళ్లికి ముందు మా మధ్య ఎన్నో అనుభూతులు పంచుకొన్నాం అని ప్రేమలత చెప్పారు.
విజయ్‌కాంత్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన మధురైలో 1952లో ఆగస్టు 25వ తేదీ జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ విజయ్‌రాజ్ అలగర్‌స్వామి. 1979లో ఇంకుమ్ ఇలమై అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 2015లో నటించిన సగప్తామ్ ఆయన చివరి చిత్రం. ఆయన నటించిన 100 చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. అప్పటి నుంచి ఆయనను అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకొంటారు. ఆయనకు పురచ్చి కలైంగ్నర్, కురుప్పు ఎంజీఆర్ అనే బిరుదులు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











