Rajinikanth Remuneration జైలర్‌కు నిర్మాత కళ్లు చెదిరే రెమ్యునరేషన్..ఎన్ని కోట్ల చెక్ ఇచ్చాడో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లు నమోదు చేస్తున్నది. ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లను నమోదు చేస్తున్నది. దాంతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్ కారణమైన రజనీకాంత్‌ను నిర్మాత కళానిధి మారన్ భారీ చెక్‌తో ఆశ్చర్యంలో ముంచెత్తారు. రజనీకాంత్‌కు మారన్ ఇచ్చిన చెక్ ఎన్ని కోట్లంటే?
రిటైర్డ్ జైలర్ పాత్రలో: జైలర్ చిత్రం రజనీకాంత్ తన వయసుకు తగిన పాత్రతో చేసిన ప్రయోగమనే చెప్పాలి. దర్శకుడు నెల్సన్ కుమార్ చెప్పిన కథ విన్న సూపర్ స్టార్ పూర్తిగా నమ్మాడు. జైలర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. కమర్షియల్ హంగులు, పాటలు, రొమాన్స్ అంశాలు లేకుండా సాధారణ రిటైర్డ్ ఉద్యోగి పాత్రతో మ్యాజిక్ చేశారు.

110 కోట్ల రెమ్యునరేషన్: జైలర్ సినిమాలో నటించినందుకు గాను రజనీకాంత్‌కు సన్ పిక్చర్స్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చింది. ఈ సినిమా కోసం రజనీకాంత్‌కు 110 కోట్ల రూపాయల పారితోషికాన్ని సినిమా రిలీజ్‌కు ముందే ఇచ్చారు. అయితే జైలర్ మూవీ అనూహ్యమైన విజయం సాధించడంతో మరోసారి రజనీకాంత్‌పై నిర్మాత తన అభిమానాన్ని చాటుకొన్నారు.

రియల్ సూపర్ స్టార్ అంటే?: రజనీకాంత్ అంటే తనకు ఎంత అభిమానమనే విషయాన్ని జైలర్ సినిమా రిలీజ్‌కు ముందు కళానిధి మారన్ తన మాటల్లో చెప్పారు. ఇండియాలో నిజమైన సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఎవరైనా సూపర్ స్టార్ అని చెప్పుకొనే వాళ్లు తమ వయసు 70 ఏళ్లు వచ్చినప్పుడు.. నిర్మాతలు అప్పుడు కూడా క్యూ కడితే వారే సూపర్ స్టార్ అని కళానిధి మారన్ అన్నారు.

లాభాల నుంచి 100 కోట్లు: జైలర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత రజనీకాంత్‌ను నిర్మాత కళానిధి మారన్‌ను కలుసుకొన్నారు. ఈ సినిమా లాభాల నుంచి కొంత మొత్తాన్ని రజనీకి మారన్ ఇచ్చాుు. ఇటీవల చెన్నైలోని మండవేలి బ్రాంచ్‌కు చెందిన సిటీ యూనియన్ బ్యాంక్ చెక్‌ను అందజేశారు. ఈ చెక్ ద్వారా 100 కోట్ల రూపాయలను ఇచ్చారు.

రజనీకాంత్‌కు మొత్తం ఎంత రెమ్యునరేషన్ అంటే?: జైలర్ సినిమా రజనీకాంత్‌కు భారీగా విజయాన్నే కాకుండా డబ్బును తెచ్చిపెట్టింది. సినిమా కోసం రెమ్యునరేషన్‌గా 110 కోట్లు రాగా, లాభాల నుంచి మరో 100 కోట్లు అమ్ముకొన్నారు. దాంతో జైలర్ సినిమా ద్వారా మొత్తంగా 210 కోట్ల రూపాయలను అందుకొన్నారు. దాంతో ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొన్న హీరోల్లో రజనీకాంత్ ఒక్కడు కావడం విశేషంగా మారింది.

జైలర్ మూవీ కలెక్షన్లు: జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం 450 కోట్లు, రెండోవారం 124 కోట్ల రూపాయలు, మూడో వారం 47 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నాలుగోవారంలో ఇప్పటి వరకు కలిపి 630 కోట్ల రూపాయలు రాబట్టింది. రజనీకాంత్ కెరీర్‌లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా జైలర్ రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











