వనితా విజయ్ కుమార్ మూడో భర్త కన్నుమూత.. పీటర్ పాల్ మృతికి కారణం ఏమిటంటే?
తమిళ సినీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ మూడో భర్త పీటర్ పాల్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం వనితా విజయ్‌కుమార్, పీటర్ పాల్ వివాహం అత్యంత వివాదంగా మారిన విషయం తెలిసిందే. పీటర్ పాల్ మరణ వార్త తమిళ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీటర్ పాల్ మరణ వార్త వివరాల్లోకి వెళితే..
వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి : నటి వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ 2020 జూన్ 27వ తేదీన వివాహం జరిగింది. పెళ్లికి ముందు వారిద్దరి మధ్య కొంతకాలం అఫైర్ నడిచింది. సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పనిచేసే పీటర్ పాల్‌ను ఓ సినిమా గురించి కలిసింది. స్క్రిప్టు నేరేట్ చేసే సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వారిద్దరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కేలా చేసింది.

వివాదంగా వనితా విజయ్ కుమార్ పెళ్లి : అయితే తన భర్త విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకొన్నారంటూ పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పీటర్, వనితా విజయ్ కుమార్ పెళ్లి మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. ఆ తర్వాత సామాజిక కార్యకర్తలు, టెలివిజన్, సినీ ప్రముఖులు రకరకాల కామెంట్లు చేసుకొంటూ ఈ వ్యవహారాన్నిపెద్ద రచ్చగా మార్చారు.

పీటర్ పాల్ భార్య ఫిర్యాదుతో : అయితే పీటర్ భార్య చేసిన ఆరోపణలపై పెద్ద వివాదమే కొనసాగింది. అయితే తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే నేను వనితా విజయ్ కుమార్‌ను పెళ్లి చేసుకొంటానని చెప్పడం మరింత వివాదంగా మారింది. తన భర్తకు విడాకులు ఇచ్చేది లేదని ఎలిజబెత్ తెగేసి చెప్పడంతో ఈ పెళ్లి వివాదం వారాలుగా సాగింది.
పీటర్ పాల్‌తో విడాకులు: అయితే పీటర్ పాల్ మద్యానికి బానిసని, ఆయన తాగుడు వ్యవహారం నచ్చకపోవడంతో వనితా విజయ్ కుమార్ విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. పీటర్ పాల్ తనతో తప్పుడు రీతిలో ప్రవర్తిస్తున్నారనే వనితా విజయ్ కుమార్ అక్టోబర్ 2020 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. దాంతో వారి పెళ్లి కథ సుఖాంతమైంది.

పీటర్ మృతికి కారణం ఏమిటంటే?: అయితే వనితా విజయ్ కుమార్‌తో విడాకుల తర్వాత పీటర్ పాల్ పెద్దగా మీడియాలో కనిపించకుండా పోయారు. కానీ ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్ పాలయ్యారు.దాంతో ఆయనను చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. పీటర్ పాల్ మరణానికి తాగుడే కారణమని ఆయన సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











