Legend ఆటో నడిపిన లెజెండ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసా?
దక్షిణాదిలో శరవణన్ స్టోర్స్ అంటే తెలియని వారు బహుశా ఉండరేమో. యోగ రత్న, రాజా రత్నం సోదరులు మల్టీ స్టోర్ రిటైలర్స్‌గా వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తారు. ఆరంభంలో టీ స్టాల్ ఓనర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వారు తమ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకొంటూ పోయి దక్షిణాదిలో అగ్ర వ్యాపార సంస్థగా మార్చారు. రత్న బ్రదర్స్ వ్యాపార దక్షతను పుణికి పుచ్చుకొన్న శరవణన్ లెజెండ్‌గా మారారు. ఆయన జీవితం, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..
లెజెండ్ శరవణన్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. నటుడిగా, నిర్మాతగా, సామాజిక కార్యకర్తగా తిరుగులేని ప్రముఖుడిగా మారారు. 1969 సంవత్సరంలో తమిళనాడులో త్రిచెండూర్‌లో జన్మించిన ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 54 వయసులో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. 50 ఏళ్లకుపై పడిన వయసులో హీరోగా నటించి మెప్పించారు.

లెజెండ్ శరవణన్‌కు మొదటి నుంచి కళలు, సినిమా రంగంపై చాలా మక్కువ. తన శరవణన్ స్టోర్స్ కోసం రూపొందించిన యాడ్స్‌లో ఆయన నటించారు. హన్సిక మోత్వానీ, తమన్నా భాటియాతో కలిసి తమ స్టోర్స్ కోసం యాడ్ షూటింగుల్లో పాల్గొన్నాడు. అయితే అగ్ర హీరోలతో నటించడంపై ట్రోల్స్ వచ్చినా వెనకడుగు వేయలేదు.
సినిమా రంగంపై ఇష్టంతో శరవణన్ తొలిసారి 2019లో నిర్మాతగానే కాకుండా హీరోగా మారి ది లెజెండ్ సినిమాను నిర్మించారు. జేడీ జెర్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఊర్వశీ రౌటేలా, గీతికా తివారీ నటించారు. ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కోట్టింది.

అయితే తాజాగా విజయదశమి పండుగ సందర్భంగా మరోసారి లెజెండ్ శరవణన్ మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించాడు. తన సిబ్బందితో కలిసి దసరా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తన సంస్థలో పనిచేసే సిబ్బందికి భారీగా బహుమానాలు అందించారు.అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన ఆశీర్వదించారు. అయితే ఈ సందర్భంగా తన ఆటోలో కూర్చోవాలని ఓ ఉద్యోగి కోరగా సరే అన్నాడు. కానీ తానే ఆటోను నడుపుతానని అడిగి.. ఆ ఆటోకు డ్రైవర్‌గా మారారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ఇదిలా ఉండగా, లెజెండ్ శరవణన్ వ్యాపార రంగంలో తిరుగు లేని నాయకుడు. ఆయన ఆస్తి సుమారుగా 6500 కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. అలాంటి కోట్ల ఆస్తి ఉన్న శరవణన్ సామాన్య జీవితాన్ని గడపడం చర్చనీయాంశమైంది. లెజెండ్ చిత్రంతో వచ్చిన ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











