చిన్న యాక్టర్ నటించిన మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్.. 2100 కోట్ల కలెక్షన్లు.. ఈ నటుడు ఎవరో తెలుసా?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఈ సినిమాను తమిళ, హిందీ నటుల మేళవింపుతో దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. తమిళంలో నుంచి యోగిబాబు, జాఫర్ సాధిక్ లాంటి నటులు తమిళ రంగం నుంచి నటించిన వారిలో ఉన్నారు. అయితే ఇటీవల దక్షిణాదిలో అద్బుతంగా ఆకట్టుకొంటున్న జాఫర్ సాధిక్ తాజాగా జవాన్‌లో తన మార్క్‌ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. అయితే ఈ నటుడు ఫెర్ఫార్మ్ చేసిన మూడు నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడింది. జాఫర్ సాధిక్ గురించిన విషయంలోకి వెళితే...

జాఫర్ సాధిక్ విషయానికి వస్తే.. 1995లో తమిళనాడులో జన్మించాడు. యాక్టర్‌గా మారకముందు కోరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా గ్రూపులో పనిచేశాడు. జాఫర్ సాధిక్ చూడటానికి చాలా చిన్నగా ఉంటాడు. అతడి ఎత్తు 4.8 అడుగులు. తమిళ వెబ్ సిరీస్ పావ కధౌైగల్‌లో కీలక పాత్ర పోషించడం ద్వారా అందర్నీ ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత శివకార్తీకేయన్ డాక్టర్ సినిమాలో మరింతగా ఆకట్టుకొన్నారు.

 Actor Jaffer Sadiq

ఇక ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో కీలకమైన పాత్రలో ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. విజయ్ సేతుపతి, కమల్‌తో పోటాపోటీగా నటించాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత శింబు, వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన వెండు థానిందాతు కాడు అనే సినిమాలో కీలక పాత్రలో ఆకట్టుకొన్నాడు. అలాగే సైతాన్ సినిమాలో కూడా అద్బుతంగా ఫెర్ఫార్మెన్స్ చేశాడు.

అలాగే రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ మూవీలో కూడా ముఖ్యమైన పాత్రను దక్కించుకొన్నాడు. రజనీకాంత్‌తో కలిసి మంచి నటనను ప్రదర్శించాడు. ఈ సినిమా కూడా 600 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇలా జాఫర్ సాధిక్ నటించిన సినిమాలు కలెక్షన్ల పరంగా, కటెంట్ పరంగా బెస్ట్ మూవీస్‌గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకొంటున్నాయి.

అలాగే జవాన్ సినిమాలో కూడా జాఫర్ సాధిక్ కీలక పాత్రలో కనిపించాడు. షారుక్ ఖాన్ పక్కనే ఫెర్ఫార్మెన్స్‌తో కూడిన పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాతో జాఫర్ సాధిక్ మరింత పాపులారిటి సాధించాడు. ఈ చిన్న నటుడు నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.

Tamil Actor Jaffer Sadiq

జాఫర్ సాధిక్ వల్ల జవాన్, జైలర్, విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించకపోయినప్పటికీ.. చిన్న నటుడు మాత్రం మంచి పేరు సంపాదించడంతోపాటు అనేక మంది అభిమానులను సొంతం చేసుకొన్నాడు. ఈ చిన్న నటుడు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారారనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. జాఫర్ సాధిక్ నటించిన ఈ మూడు సినిమాలు కూడా 2100 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X