డిసెంబర్‌లోనే ముగ్గురు తమిళ దిగ్గజ నటుల మరణం.. తమిళ ప్రజలకు శాపమా? కోలుకోలేని విషాదంగా!
సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల మరణాలు ప్రజలను, ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. తాము అభిమానించే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే వార్త గుండెలు పగిలేలా చేస్తుంది. వారితో ఉన్న అనుభూతులు చాలాకాలం వెంటాడుతుంటాయి. అయితే తమిళ సినిమా పరిశ్రమలో దైవం కంటే ఎక్కువగా అభిమానించే రాజకీయ నాయకులుగా మారి సినీ తారల మరణాలు డిసెంబర్‌లోనే జరగడం మరోసారి తమిళ ప్రజలను విషాదానికి గురిచేసింది. తమిళ ప్రజలను, ప్రేక్షకులతో విడదీయలేని లెజెండ్స్ యాక్టర్స్, దిగ్జజ నేతల మరణాల వివరాల్లోకి వెళితే..
Recommended Video

తమిళ సినిమా రంగంలో తమ ప్రభావానికి చాటుకొన్న సినీ నటులను రాజకీయాల్లో కూడా ఆదరించి వారిని గొప్ప నేతలుగా చేశారు. అందులో ప్రముఖంగా ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్‌కాంత్ ఉన్నారు. ఇక ప్రస్తుతం సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో కమల్ హాసన్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నటులను ఆ ప్రాంత ప్రజలు దైవంగా కంటే మిన్నగా చూసుకొంటారనే విషయానికి ఇవి తార్కాణంగా నిలుస్తాయి.

అయితే తమిళ సినిమా రంగంలోను, రాజకీయ రంగానికి విశేష సేవలు అందించిన ఎంజీఆర్, జయలలిత, విజయ్ కాంత్ కూడా డిసెంబర్ నెలలోనే మరణించడం ఆ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. ఈ ముగ్గురు లెజెండరీ యాక్టర్లు సంవత్సరాంతంలో తుదిశ్వాస విడిచి ప్రజలకు, అభిమానులకు కనిపించకుండా, అందనంత దూరానికి వెళ్లారు.
దిగ్గజ నటుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్‌కు 1984లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, దానితో తీవ్రమైన గుండెపోటు రావడంతో అమెరికాకు తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అనంతరం పలు అవయవాల పనితీరులో సమస్యలు రావడంతో 1987 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 3.30 గంటలకు మరణించారు.

ఇక జయలలిత విషయానికి వస్తే.. 2016 సెప్టెంబర్ 22వ తేదీన డిహైడ్రేషన్, ఇన్‌ఫెక్షన్ష్ కారణంగా ఆమె అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత కోలుకొన్నట్టే కనిపించారు. అయితే 2016 డిసెంబర్ 4వ తేదీన ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. ఆ చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి 11.30 గంటలకు మరణించారు.
ఇలాగే డిసెంబర్ నెల మరోసారి తమిళ ప్రజలకు విషాదాన్ని నింపింది. దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ కూడా సంవత్సరాంతన తదిశ్వాస విడిచారు. గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో మరోసారి తమిళ అభిమానులు గుండె పగిలేలా రోదిస్తున్నారు.

దేవుడి శాపమో.. లేక యాదృచ్చికమో కానీ డిసెంబర్ నెల తమిళ ప్రజలకు తీరని విషాదాన్ని నింపుతున్నది. దిగ్గజ నటులు, రాజకీయ నేతలు ముగ్గురు కూడా ఈ నెలలోనే మరణించడాన్ని గుర్తు చేసుకొంటున్నారు. భౌతికంగా వారు తమ మధ్య లేకున్నా వారి సేవలను గుర్తు చేసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











