The Family Man 2 : ఓవర్ నైట్ స్టార్ చెల్లం సార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోంది. చాలాకాలం వెయిటింగ్ తర్వాత రిలీజ్ అయిన ఈ సిరీస్ ను ప్రేక్షకులు సూపర్ హిట్ గా నిలిపారు. అంత గొప్పగా నిలిపిన ఈ సిరీస్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాత్ర ఏదైనా ఉందా అంటే అది చెల్లం సార్ పాత్ర అని చెప్పక తప్పదు. ఆయన గురించి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఓవర్ నైట్ స్టార్
ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో కేవలం పదిహేను నిమిషాల పాటు కనిపించే చెల్లం సార్ సూపర్ క్రేజ్ సాధించాడు. గూగుల్ సెర్చ్ లో సైతం చాలామంది చెల్లం సార్ గురించి వెతుకుతున్నారు అంటే ఆయన క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మీమర్స్ మొదలు చాలామంది ఇప్పుడు ఆయన గురించి మీమ్స్ వేస్తూ కామెంట్స్ చేస్తూ మరింత ఫేమస్ చేస్తున్నారు. ఈ సిరీస్లో భాగంగా శ్రీకాంత్ కి ఎలాంటి అవసరం వచ్చినా సరే వెంటనే చెల్లం సార్ కి ఫోన్ చేస్తే ఆ అవసరం తీరిపోయింది.

చెల్లం సార్ క్రేజ్
అలా అన్నిటికీ ఆయనే సొల్యూషన్ కావడంతో ఇప్పుడు కొంతమంది ఆయనను తన గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుంది ? కరోనా ఎప్పుడు అంతం అవుతుంది ? అంటూ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు కూడా స్పందిస్తున్నారు.. అంతేకాదు ఎలా అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉందో అలాగే చెల్లం సార్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అంటూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. అయితే ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ చెల్లం సార్ అసలు పేరు ఉదయ్ మహేష్.

తమిళంలో పరిచయమే
ఈ ఉదయ్ మహేష్ ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయ్యారు కానీ ఆయన తమిళ ఇండస్ట్రీలో చాలా రోజులనుంచి ఉన్నారు. తమిళంలో కబాలి లాంటి అనేక సినిమాల్లో నటించారు. అంతేకాక నాళై , చక్రవ్యూగం లాంటి అనేక సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. మనకు కొత్త వారే కానీ తమిళ ప్రేక్షకులకు మాత్రం ఉదయ్ మహేష్ బాగా పరిచయమే. ఆయన అసలు పేరు ఉదయభాను మహేశ్వరన్ కాగా తమిళ సినిమాలు, సీరియల్స్ లో ఎక్కువగా ఉదయ్ మహేష్ అనే పేరుతో పాపులర్ అయ్యారు.

దీపన్ పాత్ర రాగా
విషయం ఏమిటంటే సిరీస్ లోని కథా పరంగా ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో పనిచేసి రిటైరయిన ఒక ఆఫీసర్. తమిళ రెబల్స్ నాయకుడు భాస్కరన్ ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన మనోజ్ బాజ్ పేయికి ఎలాంటి అవసరం వచ్చినా ఉపయోగపడుతూ ఉంటాడు. అయితే ఈ సిరీస్లో భాగంగా ముందుగా ఆయనకు దీపన్ పాత్రలో నటించమని ఆఫర్ వచ్చిందంట, అయితే ఆ పాత్ర చెయ్యనని తప్పుకోగా మళ్ళీ యూనిట్ కాల్ చేసి ఆ పాత వద్దని చెల్లం పాత్ర చేయమని కోరారట.. అలా అనుకోకుండా చేసిన ఈ పాత్ర సూపర్హిట్ అయిపోయింది.

చెల్లం అంటే
అన్నట్టు ఇంతకీ చెల్లం అంటే ఏంటో అర్థం తెలుసా తమిళంలో చెల్లం అంటే డార్లింగ్ అని అర్థం. ఈ పదం ప్రకాష్ రాజ్ నటించిన సూపర్ హిట్ సినిమా గిల్లీలో ఉపయోగించిన తర్వాత బాగా ఫేమస్ అయింది. అయితే సిరీస్ లో మహేష్ ఒక మాజీ రక్షణ శాఖ అధికారి కాబట్టి ఈ చెల్లం అనేది ఏదైనా కోడ్ వర్డ్ అయి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











