Vijay Antony ఫ్యామిలీని వెంటాడుతున్న సూసైడ్స్.. పోస్ట్‌మార్టమ్ గదిలోకి ఒక్కడే.. కూతురు మీరాను చూసి భోరుమని!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, నిర్మాత, దర్శకుడు విజయ్ ఆంటోని పుట్టెడు దు:ఖంలో మునిగిపోయాడు. ఆయన కూతురు 16 ఏళ్ల మీరా మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని మరణించడం దక్షిణాది సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. మీరా మరణంపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఆమె భౌతికకాయాన్ని పోస్టు మార్టమ్ కోసం కావెరీ హాస్పిటల్‌కు తరలించారు. మీరా మరణంతో విషాదంలో మునిగిన విజయ్ ఆంటోనికి సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. మీరా మరణం గురించిన వివరాల్లోకి వెళితే..

మీరా (16) మరణంతో విజయ్ ఆంటోని కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. తన కుటుంబానికి ధైర్యం చెబుతూ విజయ్ ఆంటోని అండగా నిలిచారు. కావెరీ హాస్పిటల్‌లో మీరా శవ పరీక్షకు స్వయంగా హాజరయ్యారు. తన కుటుంబ సభ్యులను ఎవరినీ లోపలికి తీసుకెళ్లకుండా విజయ్ ఆంటోని స్వయంగా ఒక్కరే వెళ్లి శవ పరీక్ష సందర్భంగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 Vijay Antony Father died by Suicide

శవ పరీక్ష అనంతరం కావేరి వైద్య వర్గాలు మీరా బాడీని విజయ్ ఆంటోని ఫ్యామిలీకి అప్పగించారు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ఆయన.. అచేతనంగా పడి ఉన్న తన కూతురును చూసి విజయ్ ఆంటోని భోరు మని విలపించారు. ఏడుస్తున్న విజయ్ ఆంటోనిని స్నేహితులు, సన్నిహితులు సముదాయించడం వారి తరం కాలేకపోయింది.

విజయ్ ఆంటోని కూతురు పార్ధీవదేహాన్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివచ్చారు. పలువురు ఆమె దేహంపై పూలమాలలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. విజయ్ ఆంటోని కుటుంబాన్ని పరామర్శించేందుకు సూపర్ స్టార్ విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ స్వయంగా వచ్చారు. విజయ్ ఆంటోని, ఆయన భార్యను పరామర్శించారు. భోరున వారు ఏడుస్తుండటంతో వారికి శోభ చంద్రశేఖర్ ధైర్యం చెప్పారు.

విజయ్ ఆంటోని నివాసంలో ఉంచిన మీరా భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్భించారు. వారిలో ఉదయనిధి, కుష్బూ, మన్సూర్ ఆలీ ఖాన్, సంతానం, డీ శివ తదితరులు పరామర్శించారు. హీరో విజయ్ కూడా విజయ్ ఆంటోని నివాసానికి వస్తున్నారనే వార్త మీడియాలో కనిపించింది. విజయ్ నటించిన శుక్రన్ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే.

 Vijay Antony Father died by Suicide

విజయ్ ఆంటోని కుటుంబాన్ని సూసైడ్ వ్యవహారం మరోసారి కుదిపేసింది. విజయ్ ఆంటోని తండ్రి కూడా సూసైడ్ చేసుకొని మరణించారు. విజయ్ ఆంటోని 7 ఏళ్లు, తన సోదరి 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకొని మరణించడం విషాదాన్ని మిగిల్చింది. తండ్రి మరణం వల్ల తమను పెంచడానికి తల్లి ఎంత కష్టపడిందనే విషయాన్ని పలు సందర్భాల్లో విజయ్ ఆంటోని చెప్పడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X