జ్యోతికకు ముందు సూర్యకు ఏ హీరోయిన్‌‌పై క్రష్ ఉండేదో తెలుసా?

తమిళ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరోయిన్ అయినా.. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నువ్వు నేను ప్రేమ, గజిని, వీడొక్కడే, ఘటికుడు, సింగం, సెవెంత్ సెన్స్, జై భీమ్ వంటి సినిమాలు ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సూర్య సతీమణీ హీరోయిన్ జ్యోతిక కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే.. జ్యోతిక కంటే ముందు సూర్యకు మరో హీరోయిన్ పై క్రష్ ఉండేదంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో? ఓ లూక్కేయండి.

హీరో సూర్య విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా కంగువా మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతుంది. దీంతో మూవీ యూనిట్ తో పాటు హీరో సూర్య వరుస ప్రమోషన్లతో బిజీబిజీగా మారారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 4 లో హీరో సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగువా ముచ్చట్లు తో పాటు పర్సనల్ లైఫ్, తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీ గురించి అనేక విషయాలు పంచుకున్నారు సూర్య.

Do you know which heroine Suriya had his first crush on before Jyothika

ఈ షోలో బాలకృష్ణ.. సూర్య, కార్తీ రిలేషన్‌ని, వారి మధ్య ఉండే ప్రేమను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఓ గేమ్ కండెక్టర్ చేసి.. కార్తీ నీ నంబర్‌ను ఎలా సేవ్ చేసుకున్నాడు? అని అడిగాడు బాలకృష్ణ. 'అన్నా' అని సేవ్ చేసుకున్నట్టుగా సూర్య రాసి చూపెడుతారు. దీంతో బాలకృష్ణ..సూర్య తమ్ముడు కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. ఈ క్రమంలో కార్తీ కూడా తన అన్నయ్య సూర్య సీక్రెట్లను చెప్పేశారు. చిన్నప్పటి నుంచి అన్నయ్య అబద్దాలే చెబుతాడు అంటాడు కార్తీ.

ఈ తరుణంలో మీ అన్నయ్య ఫస్ట్ క్రష్ ఎవరు?అంటూ ప్రశ్నించాడు. హీరో కార్తీ మాట్లాడుతూ.. 'వాడికి ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టం. జెంటిల్మెన్ సినిమాలో 'చికుబుకు రైలే' సాంగ్ లో సెప్పులేసిన హీరోయిన్ గౌతమి.. అన్నయ్య ఫస్ట్ క్రష్' అని చెబుతాడు. దీంతో షాకైనా బాలకృష్ణ.. 'ఇక చాలు చాలు.. ఈ విషయంతో న్యూస్ పేపర్స్ దద్దరిల్లితాయి' అంటూ సెటైర్ వేస్తాడు. వీరిద్దరి కాన్వర్జేషన్ వింటున్న సూర్య..తన తమ్మునిపై రియాక్ట్ అవుతూ.. 'ఓరేయ్ నువ్వు కత్తి రా.. కార్తీ కాదు..' అంటాడు. దీంతో షోలో నవ్వుల పువ్వులు పూస్తాయి.

Do you know which heroine Suriya had his first crush on before Jyothika

ఇక సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించి.. పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. గతంలో ఓసారి అమ్మాయి స్టేజీపై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే.. తన భార్య జ్యోతిక గురించి చెప్పుతూ.. జ్యోతిక లేకపోతే నా జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్ అవుతారు.

More from Filmibeat

Read more about: suriya jyothika unstoppable 4
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X