నయనతార చేయకూడదని తప్పు.. దాని ఫలితం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా అగ్రస్థానంలో ఉన్న హీరోయిన్ నయనతార కెరీర్ మొదట్లో అప్పటి స్టార్ డైరెక్టర్ పార్థిబన్ కోపానికి బలై, తన కెరీర్ లో ఏడాది వెనకబడిపోయింది. డైరెక్టర్ పార్థిబన్ ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్యూలో వెల్లడించారు.

నయనతార ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న విషయం తెలిసిందే. కానీ ఆమె కెరీర్ మొదట్లో ఓ తప్పు చేసి ఉండకపోతే తాను స్టార్ అయిన ఏడాది కంటే ముందే ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలిగిపోయేది. ఓ స్టార్ డైరెక్టర్ కోపానికి బలై తన కెరీర్లో ఏడాది వెనకబడిపోయింది నయనతార. నయనతార చేసిన ఆ తప్పు ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై లుక్కేద్దాం.

లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సౌత్ లోనే అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్టులో ఈ బ్యూటీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న ఆమె సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మొదట్లో ఎన్నో విమర్శలు, అవమానాలను ఎదుర్కొన్నారు.

అదే సమయంలో ఓ ప్రముఖ దర్శకుడి కోపానికి కూడా నయనతార బలైంది. ఆమె చేసిన ఓ పని వల్ల ఆ డైరెక్టర్ కి కోపం రావడంతో కోలీవుడ్ ఎంట్రీ లేట్ అయింది. నయనతార కేరళకు చెందిన హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. మనస్సినక్కరే అనే మలయాళీ సినిమాతో ఆమె హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

Do you know why Director and Actor Parthiban got angry with Nayanthara

కెరీర్ ఆరంభంలోనే సుమారు మూడు మలయాళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ 2005లో విడుదలైన అయ్యా మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యంగ్ హీరోలతో పాటు అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సొంతం చేసుకుంది.

మొత్తానికి చెన్నైలోనే స్థిరపడిపోయిన నయనతార గతంలో వేసిన తప్పటడుగు కారణంగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏడాది ఆలస్యంగా అడుగు పెట్టేలా చేసింది. అయ్యా మూవీ 2005 లో రిలీజ్ అయ్యింది. కానీ అంతకంటే ఏడాది ముందే తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టే అవకాశం దక్కింది నయన్ కు.

దర్శకుడు, నటుడు పార్థిబన్ రూపొందించిన కుడైకుల్ మలై అనే సినిమాలో ముందుగా నయనతారనే హీరోయిన్ గా అనుకున్నారు. 2004లో పార్థిబన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నయనతార అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించారట. ఆమె ఇంకా అప్పటికీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోవడంతో ఆమె ఫోటోను చూడగానే పార్థిబన్ తనే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారట.

Do you know why Director and Actor Parthiban got angry with Nayanthara

ఈ మేరకు నయనతారకు ఫోన్ చేసి ఒక సినిమా చేస్తున్నాను అనే విషయాన్ని చెప్పి అందులో మీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా చెన్నైకి వచ్చి నన్ను కలవండి అని చెప్పారట. అయితే కారణం ఏంటో తెలియదు కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు కలవకుండా ఆ తర్వాత రోజు ఫోన్ చేసి నిన్న మిమ్మల్ని కలవలేకపోయాను. రేపు తప్పకుండా కలుస్తాను అంటూ వివరణ ఇచ్చిందట నయనతార.

కానీ చెప్పిన టైంకి ఆమె వచ్చి కలవలేదన్న కోపంతో ఉన్న పార్థీవన్ కు నయనతారకు సమాధానం మరింత కోపాన్ని తెప్పించిందట. దీంతో నువ్వు రావాల్సిన అవసరం లేదు అంటూ ఫోన్ పెట్టేసారట. ఈ సంఘటన కారణంగా నయనతార 2024లో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన ఛాన్స్ మిస్ అయ్యి, 2025లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా పార్థిబన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X