4 ఏళ్ల క్రితం విజయ్‌కాంత్ కొడుకు నిశ్చితార్థం.. లెజెండరీ యాక్టర్ మృతికి, కొడుకు పెళ్లి వాయిదాకు కారణం ఒకటేనట!

తమిళ సీనియర్ స్టార్ హీరో, గ్రేట్ పొలిటీషియన్ కెప్టెన్ విజయ్ కాంత్ గురువారం రోజు ఉదయం మరణించిన విషయం అందరికీ తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ విషయం తెలుసుకున్న తమిళులతో పాటు తెలుగు ప్రజలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. అతి తక్కువ మంది మధ్య శుక్రవారం రోజు విజయ్‌కాంత్ అంత్రయక్రియలు జరిగాయి. అయితే ఆయన కొడుకుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కెప్టెన్ విజయ్‌కాంత్ 1990వ సంవత్సరం జనవరి 31వ తేదీన ప్రేమలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే పెద్ద కుమారుడు విజయ ప్రభాకరన్ కాగా... రెండో కుమారుడు షణ్ముఘ పాండియన్. రెండో అబ్బాయి షణ్ముఘ పాండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టి పలు చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా సగప్తం, మధుర వీరన్ అనే చిత్రాల్లో హీరోగా మెరిశాడు. ఇక పెద్ద కుమారుడు విజయ ప్రభాకరన్ పొలిటీషియన్ గా కొనసాగుతున్నాడు. తండ్రి స్థాపించిన పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు.

Do You Know Why Late Kollywood Star Hero Vijaykanth Son Vijaya Prabhakaran Marriage

అయితే విజయ్‌కాంత్ పెద్ద కుమారుడు విజయ ప్రభాకరన్ కు 2019లో కోయంబత్తూరుకు చెందిన ఓ బిజినెస్ మేన్ కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువ మంది బంధువులు సమక్షంలో విజయ ప్రభాకరన్.. కీర్తనా చేతికి ఉంగరం తొడిగాడు. అయితే వీరి ఎంగేజ్ మెంట్ జరిగి ఇప్పటికీ నాలుగేళ్లు అవుతుండగా పెళ్లి మాత్రం ఇంకా కాలేదు. అయితే వీరి పెళ్లి ఇంతకాలం కాకపోవడంతో చాలా మంది వీరిక పెళ్లి చేసుకోరని అనుకున్నారు. ఇరుకుటుంబాల మధ్య పొసగకే పెళ్లి మాట ఎత్తట్లేదని కూడా చాలా మంది భావించారు. కానీ అవన్నీ అవాస్తవమేనట.

కీర్తనను పెళ్లి చేసుకోవడం ప్రభాకరన్ కు చాలా ఇష్టమట. కానీ వీరి పెళ్లి ఇలా వాయిదా పడుతూ రావడానికి.. విజయ్‌కాంత్ మృతికి కారణం ఒకటేనంటూ వారి దగ్గరి బంధువులు చెబుతున్నారు. అయితే ఈ రెండు విషయాలకు లింక్ ఏంటి.. ఎందుకు ఇంతకాలం వీరు పెళ్లి చేసుకోలేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విజయ ప్రభాకరన్, కీర్తనల నిశ్చితార్థం జరిగిన కొంత కాలానికే వీరు పెళ్లి పెట్టుకోవాలని అనుకున్నారట. ముహూర్తాల కోసం ఇరు కుటుంబ సభ్యులు చర్చలు కూడా జరిపారట. కానీ అంతలోనే కరోనా మహమ్మారి రావడంతో వీరి పెళ్లికి తొలిసారి బ్రేకులు పడ్డాయి.

కరోనా తగ్గిన తర్వాత మరోసారి విజయ్‌కాంత్ వీరి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలని ప్లాన్ చేశారట. చాలా గ్రాండ్ గా పెళ్లి చేయాలని.. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా వీరి విహానికి పిలవాలని భావించారట. అయితే అప్పుడు మోదీకి చాలా పనులు ఉండడంతో ఆయనకు వీలు కాదని అన్నారట. అయితే మీకు వీలయినప్పుడు నా కొడుకు పెళ్లి పెట్టుకుంటానని విజయ్‌కాంత్ చెప్పడంతో.. మోదీ టైమ్ కోసం వేచి చూశారట. ఆ తర్వాత మోదీకి వీలు అయినా.. విజయ్‌కాంత్ ఆరోగ్యం క్షీణించిందట. ఇలా ట్రీట్ మెంట్ కోసం విజయ్‌కాంత్ ను అమెరికా తీసుకెళ్లారు.

Do You Know Why Late Kollywood Star Hero Vijaykanth Son Vijaya Prabhakaran Marriage

గత ఏడాది కాలంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న విజయ్‌కాంత్ కుటుంబ సభ్యులు అంతా ఈయన ఆరోగ్యం గురించి టెన్షన్ పడే వాళ్లట. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం సరికాదని భావించిన విజయ్ ప్రభాకరన్.. పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారట. అయితే తాజాగా విజయ్‌కాంత్ మరోసారి కరోనా వచ్చి చనిపోగా.. కొడుకు పెళ్లి వాయిదాకు, విజయ్‌కాంత్ మృతికి కోరనానే కారణం అని అంతా చెప్పుకొస్తున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే.. ఏడాది లోపు ఏదైనా కార్యం జరిపించాలని చాలా మంది అంటుంటారు.. ఇరు కుటుంబాలు కూడా అదే అనుకుంటే 2024లో విజయ్ ప్రభాకరన్, కీర్తనల పెళ్లి జరగడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X