GOAT: ఇళయదళపతి విజయ్ గోట్ మూవీని మిస్ చేసుకొన్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాదిలో సౌత్ ఇండియన్ సినిమా నుంచి ద్వితీయార్ధంలో మాత్రం ఎక్కువ సంఖ్యలోనే పలు పాన్ ఇండియా చిత్రాలు అలాగే ప్రముఖ స్టార్ హీరోస్ నుంచి కూడా ఎక్కువ సినిమాలు పడబోతున్నాయని చెప్పాలి. కాగా ఈ లిస్ట్ లో చాలా సినిమాలు పలు పండుగల టార్గెట్ గా వస్తుండగా తెలుగు సహా తమిళ్ సినిమా నుంచి కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
మరి ఈ చిత్రాల్లో తమిళ విజయ్ దళపతి నటించిన గోట్ గా పిలవబడుతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా ఒకటి. కాగా ఈ సినిమాని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా విజయ్ కెరీర్ లో 68వ సినిమా ఇది. మరి ఇందులో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్టుగా ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. పలు పోస్టర్స్ కానీ గ్లింప్స్ లలో విజయ్ డ్యూయల్ యాక్షన్ అదరగొట్టాడు.

అయితే ఈ లుక్స్ లో ఒక యంగ్ విజయ్ ఒకరు ఓల్డ్ విజయ్ లు కనిపించడం మనం గమనించవచ్చు. దీనితో వయసులో వ్యత్యాసం క్లియర్ గా కనిపిస్తుడడంతో ఇవే పాత్రలు విజయ్ తో కాకుండా మరో ఇద్దరు బిగ్ స్టార్స్ తో వెంకట్ ప్రభు ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా పలు రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాగా ఆ స్టార్స్ మరెవరో కూడా కాదట. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా యువ హీరో ధనుష్ తో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

విజయ్ ఏవైతే రెండు వేరియేషన్స్ ఒక ఓల్డేజ్ వ్యక్తిగా యంగ్ కుర్రాడిగా చేసిన ఈ రెండు పాత్రలు రజినీకాంత్ పెద్ద మనిషిగా ధనుష్ యంగ్ రోల్ లో చేయాల్సి ఉన్నాయట. కానీ అప్పటికే రజినీకాంత్, ధనుష్ లు ఏమాత్రం గ్యాప్ లేకుండా పలు సినిమాలలో బిజీగా ఉండడంతో "వారిసు" తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో వెంకట్ ప్రభు అయితే ఈ స్టోరీని విజయ్ తో ఓకే చేసుకున్నాడట.
అలా ఆ ఇద్దరు బిగ్ స్టార్స్ ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్నారని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో అయితే విజయ్ సరసన గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి విజయ్ సరసన నటిస్తుండగా తనతో పాటుగా సీనియర్ నటి స్నేహ కూడా నటిస్తుంది. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ సెప్టెంబర్ 5న తమిళ్, తెలుగు సహా హిందీ భాషల్లో అయితే విడుదలకి రాబోతుంది.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తమిళ్ లో వేట్టైయన్ అలాగే దర్శకుడు లోకేష్ కనక రాజ్ కాంబినేషన్ లో "కూలీ" అనే మాస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక ధనుష్ రీసెంట్ గానే తన దర్శకత్వంలో చేసిన చిత్రం 'రాయన్' తో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులోనే 'కుబేర' అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











