twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్యభామ యూనివర్శటి-ప్రభుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం...!

    By Sindhu
    |

    తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫెర్ ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుకు ఒక అరుదైన గౌరవం దక్కబోతోంది. ఒకప్పటి తమిళ హీరో ప్రభు ప్రస్తుతం తండ్రి, మామయ్య పాత్రలు చేస్తున్నాడు. 'డార్లింగ్" సినిమా లో ప్రభాస్ కు తండ్రిగా నటించాడు. తాజాగా 'ఆరంజ్" చిత్రంలో జెనీలియాకు తండ్రిగా ప్రభు నటించాడు. అలాగే రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ 'శక్తి" చిత్రంలో కూడా ఇలియానాకు తండ్రిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో హీరోలకు, హీరోయిన్స్ కు తండ్రిగా నటించే అవకాశాలు తనను వరించడం పట్ల ఆనందంగా ఉన్నారని సమాచారం.

    దాదాపు 150పైచిలుకు సినిమాల్లో నటించాడు తమిళ హీరో ప్రభు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగానూ సత్యభామ యూనివర్శిటీ ప్రభుకు డాక్టరేట్ ప్రధానం చేయనుంది. మే12న యూనివర్శిటీ క్యాంపస్ లో ఓ వేడుక ఏర్పాటు చేసి ఆ వేదికపైన ప్రభుకు డాక్టరేట్ ఇవ్వడానికి యూనివర్శిటీ సన్నాహాలు చేస్తోంది. తనకు లభించిన ఈ గౌరవానికి ప్రభు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. 1982లో 'సంగిలి"అనే తమిళ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ప్రభు 150పైచిలుకు సినిమాలు చేయడం విశేషం.

    English summary
    Tamil Actor Prabhu, who acted in almost all 150+ films is currently doing Character Artiste roles. Recognizing his service to Film Industry, Sathyabhama University has planned to present Doctorate to Hero Prabhu. It is said that University will give the Doctorate to Prabhu in a function to be held at University Campus on May 12th. Prabhu expressed his happiness on receiving the doctorate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X