ఆ విషయాలు రజనీ కుటుంబాన్ని బాధిస్తున్నాయా?
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో రజనీకాంత్‌పై చాలా కాలంగా జోకులు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జోక్స్ సంగతి వారి కుటుంబ సభ్యుల దృష్టికి కూడా వెళ్లాయి. దీనిపై రజనీకాంత్ కూతురు సౌందర్య స్పందిస్తూ....ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడని ప్రజలు నమ్మడం వల్లనే అలాంటి జోక్స్ ఆయనపై ప్రచారంలోకి వస్తున్నాయని తెలిపారు. అందుకే ఈ జోక్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపారు.
'చాప్ స్టిక్స్‌తో దోసె తినడం రజనీకాంత్‌కు మాత్రమే సాధ్యం, రజనీకాంత్ తన ఫస్ట్ ఎయిడ్ బాక్సుతో క్యాన్సర్ నయం చేస్తారు, కళ్లు మూయకుండా తుమ్మడం ఆయనకే సాధ్యం' లాంటి జోక్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారంలోకి వచ్చి రజనీకాంత్ అభిమానులకు నవ్వులు పంచుతున్నాయి.

ఇలాంటి జోక్స్ రజనీకాంత్‌పై గౌరవానికి చిహ్నంగా భావిస్తున్నట్లు రజనీ కూతురు సౌందర్య తెలిపారు. ' ఏ విషయంలో అయినా అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆయనకే సాధ్యమని అంతా నమ్ముతున్నారు. ఇలాంటి జోక్స్ ఆయన గౌరవాన్ని పెంచుతున్నాయని భావిస్తున్నాను. అందుకే వీటిని మేము పాజిటివ్‌గా తీసుకుంటున్నాం' అన్నారు.
'ఆయన అన్నింట్లోనూ బెస్ట్...ఆయన ఒక సూపర్ స్టార్...ఆయన కూతురుగా పుట్టినందుకు గర్వంగా ఉంది' అని సౌందర్య తెలిపారు. తన తండ్రి రజనీకాంత్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











