మా పెళ్లిపై పుకార్లు నమ్మవద్దు : ప్రభుదేవ
నయన తారతో తన పెళ్లికి సంబంధించి వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దని దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా అభిమానులకు సూచించాడు. త్వరలో తమ పెళ్లికి సంబంధించిన తేదీలన ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పెళ్లి తర్వాత నయన తార సినిమాల్లో నటించబోదని ప్రభుదేవా తేల్చి చెప్పారు. అందరికీ తెలిసే తామ పెళ్లి చేసుకుంటామని, రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి తామేమీ తప్పు చేయడం లేదని ప్రభుదేవా వెల్లడించారు. అందరి సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందన్నారు.
ప్రభు-నయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, వీళ్ల పెళ్లికి పెద్దగా వ్యవహరించనున్న ప్రకాష్ రాజ్ సినిమా షూటింగులో బిజీగా ఉండటంతో ఈ జంట తమ పెళ్లిని మరికొంత కాలం వాయిదా వేసుకున్నారని, పెళ్లి తర్వాత ప్రభుదేవా నటించే సినిమాల్లో నయన నటిస్తుందని....గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాకు తారస పడ్డ ప్రభుదేవా పుకర్లపై పై విధంగా స్పందించారు.


Click it and Unblock the Notifications











