For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు నచ్చని పదం అది ..అలా పిలవకండి : సిద్ధార్థ్‌

    By Srikanya
    |

    చెన్నై : వరస ఫ్లాప్స్ వస్తున్నా వరస ఆఫర్స్ సంపాదిస్తున్న హీరో సిద్దార్ధ్. 'బాయ్స్‌' ద్వారా పరిచయమైన సిద్ధార్థ్‌ ఆ చిత్రం తర్వాత వచ్చిన నువ్వు వస్తానంటే నే వద్దంటానా తో ...టాలీవుడ్‌లో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకుని క్రేజీ హీరోగా మారాడు. ఆ తర్వాత..బొమ్మరిల్లుతో హిట్ ఇచ్చి ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే అంతే స్పీడుగా వెనక్కి వచ్చేసాడు. తాజాగా బాద్షాలో గెస్ట్ రోల్ చేసిన సిద్దార్దకు..చాక్లెట్ బోయ్ అంటే నచ్చదట. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు..

    . సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. ప్రారంభంలో నేను ప్రేమకథల్లో నటించడంతో చాక్లెట్‌బాయ్‌ ఇమేజ్‌ వచ్చింది. అందరూ అలాగే పిలిచారు. ఆ తర్వాత యాక్షన్‌ సినిమాలు చేయడం ప్రారంభించా. ఇప్పటికీ చాక్లెట్‌బాయ్‌ అంటున్నారు. ప్రస్తుతం నాకు నచ్చని పదం.. చాక్లెట్‌బాయ్‌. ఇకనైనా అలా పిలవద్దని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు.

    అలాగే...'బాయ్స్‌' తర్వాత తమిళంలో పెద్దగా అవకాశాలు రాలేదు. మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కొద్దిపాటివాటిని కూడా వదులుకున్నాను. ఆ సమయంలో తెలుగు సినిమా కోసం ప్రభుదేవా నుంచి పిలుపొచ్చింది. అప్పటికి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. అయితేనేం... వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాను. పట్టుదలతో రెండు నెలల్లోనే నేర్చుకున్నాను. ఆపై ప్రభుదేవా దర్శకత్వంలో 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' చేశా. అద్భుత విజయం సాధించింది. రూ.30 కోట్లు వసూలు చేసింది. అలా టాలీవుడ్‌లో గట్టి పునాది వేసింది అన్నారు.

    ఇటీవల ఆయన నటించిన 'కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి' విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇక్కడా హవా కొనసాగించాలని అనుకున్నాడట. ఆ మేరకు సుందర్‌.సిను కలిసి 'మీ దర్శకత్వంలో నటించాలనుకుంటున్నాు'అని చెప్పాడట. సుందర్‌.సి కూడా కథ సిద్ధం చేసుకున్నాడు. ఆ చిత్రమే 'తీయా వేలసెయ్యనుం కుమారు'. 'తీయా వేలై సేయునం కుమారే'(ఇది తెలుగులో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ పేరిట విడుదలవనుంది) హన్సిక హీరోయిన్.

    English summary
    
 Siddardha says that he is not intrested in Chocolate boy Image. So he requests media don't call him like that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X