twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బలవంతంగా రుద్దకండి, పరీక్షించటం వద్దు:వివాదాస్పద అంశం పై కమల్ హాసన్ ట్వీట్

    |

    ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవడానికి సినిమాహాళ్లలో జాతీయ గీతం ప్రసారమైనప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్పందించారు. ఈ విషయంలో ఆయన సుప్రీంకోర్టుకే మద్దతు తెలిపారు.థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించడంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలకు వచ్చే వారు అక్కడ దేశభక్తిని చాటాల్సిన అవసరముందా అని పలువురు గతంలో కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

    కమల్ హాసన్

    కమల్ హాసన్

    ప్రభుత్వ కార్యాలయాలు అసెంబ్లీ - సచివాలయాలు వంటి చోట్ల ప్రతిరోజూ జాగీయ గీతాన్ని ఆలపించడం లేదని అటువంటపుడు థియేటర్లలో మాత్రం ఈ నిబంధన ఎందుకని సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడాన్ని కమల్ తప్పుబట్టారు.

    నన్ను బలవంతం చేయొద్దు

    నన్ను బలవంతం చేయొద్దు

    "ఎక్కడ పడితే అక్కడ నా దేశభక్తికి పరీక్షలు పెట్టొద్దు. దేశభక్తిని చాటుకోవాలని నన్ను బలవంతం చేయొద్దు" అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. సినిమా హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాకుండా ఐచ్ఛికం చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో మంగళవారం స్పందించిన ఆయన ట్విట్టర్‌లో దీనిపై ట్వీట్ చేశారు.

    సింగపూర్‌లో

    సింగపూర్‌లో

    జాతీయ గీతాన్ని కేంద్ర ప్రభుత్వం పౌరులపై బలవంతంగా రుద్దరాదని అభిప్రాయుపడ్డారు. సింగపూర్‌లో జాతీయుగీతాన్ని ప్రతిరోజూ అర్ధరాత్రి ప్రసారం చేస్తారని, ఆ దేశం అనుసరిస్తున్న దయాపూరిత నియంతృత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి గానీ తనకు ఎక్కడ పడితే అక్కడ దేశభక్తి పరీక్షలు పెట్టరాదని కమల్ పేర్కొన్నారు.

    దూరదర్శన్ చానెళ్లలో

    దూరదర్శన్ చానెళ్లలో

    జాతీయ గీతాన్ని కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ చానెళ్లలో ప్రసారం చేయువచ్చని, అంతేకానీ పౌరులను బలవంతం చేయురాదన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయితే, ఆ తీర్పులోని షల్(ఖచ్చితంగా) పదం స్థానంలో మే(ఇష్టాన్ని బట్టి ) అనే పదాన్ని చేర్చాలని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో కమల్ ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు.

     అరవింద్ స్వామి

    అరవింద్ స్వామి

    మరో తమిళ నటుడు అరవింద్ స్వామి కూడా ఈ వివాదం పై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. గవర్నమెంట్ ఆఫీసులు - కోర్టులు - అసెంబ్లీలు - పార్లమెంటు హాలులో రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరన ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు. కేవలం..వినోదం కోసం వచ్చే సినిమా హాళ్లలోనే జాతీయ గీతం వినిపించడం ఎందుకు తప్పనిసరి చేశారని ప్రశ్నించారు.

     జాతీయగీతం ఎప్పుడు వినిపించినా

    జాతీయగీతం ఎప్పుడు వినిపించినా

    తాను జాతీయగీతం ఎప్పుడు వినిపించినా లేచి నిలబడతానని జాతీయగీతం ఆలపిస్తానని అన్నారు. మరోవైపు గతంలో థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడాన్ని సమర్థించిన సుప్రీం కూడా పునరాలోచనలో పడింది. మరి సుప్రీం సూచన మేరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

    English summary
    Singapore plays it's national anthem every midnight.Likewise do so on DD. Do not force or test my patriotism at various random places.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X