నా పాటలు వాడుకోవద్దు: ఇళయరాజా వార్నింగ్
కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చాలా మంది దర్శక,నిర్మాతలు నా పాటల్ని,బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ ని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిని ప్రోపర్ ఫర్మిషన్ మరియు లైసన్స్ లేనిదే నా వర్క్ ఏదీ వాడుకోవటానికి వీల్లేదని దాటి ప్రవర్తిస్తే కేసులు పెట్టపెట్టవలిసి వస్తుందంటూ ఇళయరాజా సీరియస్ గా వార్నింగ్ ఇఛ్చారు. అలాగే ఎడ్వర్టైజ్ మెంట్ ఏజన్సీలు,టీవీ ఛానెల్స్, సీరియల్స్ నిర్మాతలు పర్మిషన్ తీసుకుని మాత్రమే నా స్వరాలని వినియోగించుకోమని చెప్తున్నాను అన్నారు. ఈ విషయాన్ని ఆయన చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇక తన వర్క్స్ అన్నీ అగీ మ్యూజిక్ వారికి సొంతమని,వారే ఆ రైట్స్ మొత్తం కలిగి ఉన్నారని తెలియ చేసారు. తమ ఫర్మిషన్ లేకుండా ఏదైనా కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అంతేగాక ఇళయరాజా గారి సంగీతం రేడియో బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కూడా తామే తీసుకున్నామని, ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ పైన కూడా ఆంక్షలు విధించనున్నామని అగీ మ్యూజిక్ సిఇఓ ఆగిలిన్ లీచ్ మ్యాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఇక ఇళయరాజా సంగీతం అందించిన తెలుగు చిత్రం ఓం శాంతి త్వరలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











