దళపతి విజయ్‌‌తో డ్రాగన్ టీమ్.. కన్నీళ్లు పెట్టుకొన్న డైరెక్టర్!

దక్షిణాదిలో భారీ విజయం సాధించిన చిత్రం డ్రాగన్. తెలుగులో ఈ చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌తో ప్రేక్షకులను ఆలరించింది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు బ్రహ్మండంగా ఆదరించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇటీవలే ముగిసింది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించిన తర్వాత దళపతి విజయ్‌ని డ్రాగన్ టీమ్ కలిసింది. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రదీప్ రంగనాథన్, కాయడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను గ్రాండ్‌గా సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Thalapathy Vijay meets Dragon Team

ఇక తమిళ, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో డ్రాగన్ చిత్రం అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా 70 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఘనవిజయాన్ని టీమ్‌కు అందించింది.

గతంలో దళపతి విజయ్‌తో ఏజీఎస్ సంస్థ మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా డ్రాగన్ టీమ్‌ను నిర్మాత అర్చన ఆయనకు పరిచయం చేసింది. తన బిజీ షెడ్యూల్‌ను కొంత పక్కన పెట్టి డ్రాగన్ టీమ్‌తో విజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న టీమ్‌ను విజయ్ అభినందించారు.

ఈ సందర్భంగా డ్రాగన్ దర్శకుడు అశ్విన్ మారిముత్తు ఎమోషనల్ అయ్యాడు. విజయ్‌తో గడిపిన క్షణాలను ఆయన భావోద్వేగంతో పంచుకొన్నారు. నేను విజయ్ సార్‌ను కలిసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. ఆయనతో పనిచేయాలని కూడా కలలు కన్నాను. ఆ విషయం నా టీమ్ మెంబర్స్‌కు తెలుసు. నేను ఆయనతో పనిచేస్తానో లేదో తెలియదు. కానీ ఆయనను కలిశాను. ఆయనకు ఎదురుగా కూర్చొనే అదృష్టం నాకు దక్కింది అని అశ్వత్ మారిముత్తు తన పోస్టులో పేర్కొన్నారు.

Thalapathy Vijay meets Dragon Team

విజయ్ సార్ ముందు కూర్చొన తర్వాత నేను చాలా మాట్లాడుతానని అందరూ అనుకొన్నారు. కానీ నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. నేను విజయ్‌కి ఎంత పెద్ద ఫ్యాన్‌నో నా ఫ్రెండ్స్‌కు తెలుసు. అలాంటింది ఆయన ముందు ఒక్క మాట రాలేదు. ఆయన నావైపు చూడగానే నా కళ్ల నుంచి నీళ్లు టపటపా రాలాయి. అది చూసి నా టీమ్ ఆశ్చర్యపోయింది. ఆయన అంటే నాకు అంత ఇష్టం అని అశ్వత్ మారిముత్తు వెల్లడించారు.

నేను ఎన్నో కలలతో సినిమా పరిశ్రమకు వచ్చాను. ఒక్కసారిగా నన్ను విజయ్ చూసి.. గ్రేట్ రైటింగ్ బ్రో అంటూ ప్రశంసించగానే.. నేను వచ్చిన పని పూర్తయిందనే ఫీలింగ్ కలిగింది. నా లైఫ్ సర్కిల్ పూర్తయిందనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి అవకాశం కల్పించిన అర్చన కల్పతి మేడమ్‌కు ధన్యవాదాలు. నా అభిమాన హీరోను కలిసేంత వరకు కూడా నాకు తెలియదు అని ఆయన ట్వీట్‌లో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X