పోలీస్ కేసులో మల్లికా షెరావత్

'దశావతారం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె వేసుకున్న అరకొర దుస్తులు ఆ సంస్థకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో ఆ సంస్థ కార్యకర్త ఎస్.ఆర్. కనిరాజ్ ఆమెకు వ్యతిరేకంగా పెరియమెట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. "తన వీపును ప్రదర్శించే విధంగా మినీ స్కర్టును ధరించిన ఆమె ముఖ్యమంత్రి కరుణానిధి ఎదుట కాలిమీద కాలేసుకుని కూర్చుని తమిళ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేవిధంగా ప్రవర్తించారు. చిత్త చాపల్యం కలిగేవిధంగా నడచుకున్నారు" అని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మల్లిక మీద చర్య తీసుకోవాలసిందిగా ఆయన పోలీసులను కోరారు.
కొద్ది వారాల క్రితం కూడా హెచ్ఎంకె ఇదేవిధంగా టాప్ హీరోయిన్ శ్రియ మీద ధ్వజమెత్తింది. అప్పుడామె 'శివాజీ' సిల్వర్ జూబ్లీ వేడుకకు కురచ దుస్తులతో హాజరైంది. కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున్న శ్రియ దాంతో బేషరతు క్షమాపణ చేప్పుకోక తప్పలేదు. అయితే ప్రస్తుతం చేతిలో మరే తమిళ సినిమా లేని మల్లిక క్షమాపణ చెబుతుందా? ఆమెకి ఆ అవసరం ఏముంది దీని ప్రభావం దశావతారం పై పడే అవకాశం ఉందా అని పరిశ్రమ పెద్దలు పరిశీలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











