ఆ స్పీడుకి మిగతా హీరోలకి మతిపోతోంది

By Srikanya

చెన్నై: కమల్ హాసన్ తోటి యువ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నట్లుగా జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఆయన షెడ్యూల్ చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. ఎందుకంటే ఉత్తమవిలన్ చిత్రం గుమ్మిడికాయ కొట్టి క్లోజ్ చేసిన మరుసటి రోజు నుంచే దృశ్యమ్ చిత్రం రీమేక్ కి డేట్స్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనటానికి సిద్దమవుతున్నారు. ఇది చూసి మిగతా తమిళ హీరోలంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా పనిచేసే ఆయన వర్కింగ్ కల్చర్ ని మెచ్చుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా చేయటానికి మన హీరోలు మీన మేషాలు లెక్కపెడుతూంటారు. కమల్ ని చూసి నేర్చుకోవాలని టాలీవుడ్ అంటోంది. నిజమే కదా మరి.

విశ్వనటుడు కమల్‌హాసన్‌ చిత్రాలు మూడు ఈ ఏడాది విడుదల కానున్నాయన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రోజురోజుకూ వేగాన్ని పెంచుతున్న ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా కమల్‌ నటించిన 'విశ్వరూపం-2' ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల చెంతకు రానుంది.

తన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న 'ఉత్తమ విలన్‌' చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను జూలై 14 తో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్‌ అరవింద్‌. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్‌ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Drishyam remake begins when Uthama Villain ends!

మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్‌లో కమల్‌ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్‌ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్‌' చిత్రీకరణ పూర్త్తెన మరుసటి రోజే అంటే జూలై 15న 'దృశ్యం' రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X