twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ కి ట్విస్ట్: ‘దృశ్యం' రీమేక్ ఆపమని కోర్టు

    By Srikanya
    |

    హైదరాబాద్: మళయాళ,తెలుగు,కన్నడ భాషల్లో విజయవంతమైన దృశ్యం చిత్రాన్ని కమల్ హాసన్ తమిళంలో తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ ఏర్పాట్లులలో ఉండగా...కేరళలలోని ఎర్నాకులం జిల్లా కోర్టు ఆ రీమేక్ ని ఆపమని ఉత్తర్వులు ఇచ్చింది. దానికి కారణం....మళయాళి రచయిత సతీష్ పౌల్ రాసిన Oru Mazhakalathu కథ నుంచి కాపీ కొట్టి..దృశ్యం తీసారని కోర్టుకి ఎక్కటమే. 2013 మే నెలలో ఈ కథ పబ్లిష్ అయ్యింది. డిసెంబర్ 2013 లో మళయాళంలో మోహన్ లాల్ హీరోగా దృశ్యం విడుదలైంది.

    ఈ కేసు విషయం తేలేవరకూ తమిళ రీమేక్ ని ఆపమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రచయిత కి చెందిన అడ్వకేట్ మాట్లాడుతూ... 2009లో సతీష్ స్క్రిప్టు రాసి చాలా మంది నిర్మాతలను కలిసానని, అందులో దృశ్యం నిర్మాత ఆంటోని ఒకరని అన్నారు. అయితే ఆంటోని ఈ స్క్రిప్టు చేయటానికి ఆసక్తి చూపలేదు. అయితే మరో ఇద్దరు నిర్మాతలు మాత్రం కొత్తవాళ్లతో లో బడ్జెట్ లో ఈ చిత్రం ప్లాన్ చేసారు. వాళ్లు ఏప్రియల్ లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ లోగా కొంతమంది దృశ్యం స్టోరీలైన్ గురించి చెప్పి ఆపుచేయించారు.అప్పుడు దృశ్యం దర్శకుడు జీతూని కలిస్తే..దృశ్యం చిత్రం ఫ్యామిలీ డ్రామా అని అన్నారు. రిలీజయ్యాక చూస్తే పూర్తిగా సతీష్ చెప్పిన కథకు జెరాక్స్ కాపీ అని చెప్పారు.

    Drishyam’s Tamil remake stalled by Kerala court

    సర్లే...ఈ సినిమాని తమిళంలో ఒరు చెన్నై క్రైమ్ స్టోరీ పేరుతో చేద్దామని నిర్ణయించుకుంటే అక్కడా రీమేక్ అవుతోంది. అతను ఇప్పుటికే ఈ స్క్రిప్టుని తమిళంలోకి ట్రాన్స్ లేట్ చేసుకున్నాడు. కమల్ తో ఈ దృశ్యం రీమేక్ చేస్తున్న్రారని ఇక అక్కడ కూడా చెయ్యలేమనే నిర్ణయానికి వచ్చే కోర్టుకి రావాల్సి వచ్చింది అన్నారు. సతీష్ గతంలో ప్రింగర్ ప్రింట్ అనే మళయాళ చిత్రం డైరక్ట్ చేసారు. అందులో జయరామ్,గోపిక నటించారు. అదో థ్రిల్లర్ చిత్రం...2005లో రిలీజ్ అయ్యింది.

    మరో ప్రక్క ఇప్పటికే 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్‌కు గురైందట.

    English summary
    A Malayalam filmmaker-scriptwriter has filed a petition with the Ernakulam District Court asking to stop the Tamil remake of Drishyam, alleging that the original film is a copy of his story published as a book in May 2013 called Oru Mazhakalathu. The Malayalam Drishyam was released in December 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X