పోలీస్ ఆఫీసర్ భార్య పై కన్నేసిన ‘మద మృగం’

By Sindhu

కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రల్లో సమీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ద్రోహం' చిన్న చిత్రాల్లో గొప్ప కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణో ఫిలిమ్స్ పతాకంపై 'మదమృగం' పేరుతొ నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి మాట్లాడుతూ 'విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మొదటి వారంలోనే 3 కోట్లు కలెక్ట్ చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. చూసిన ప్రతిది తన సొంతం అయిపోవాలనుకునే ఓ జమిందారు కొడుకు కధ ఇది. ఒక రోజు ఓ పోలిస్ ఆఫీసర్ భార్య అతని కంట్లో పడుతుంది. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు. దాని కోసం ఒక పధకం వేసి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను వెనుక నుంచి కౌగిలించుకుంటాడు. అదే టైం లో ఫోటో తీసేలా ప్లాన్ చేసి ఆ ఫోటోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.

అతను సైకో కాదు, హంతకుడు కాదు కాని ఒక డిఫరెంట్ మెంటాలిటీతో అందర్నీ హడలెత్తిస్తుంటాడు. అయితే చివరికి ఏం జరిగింది. అతని ఆగడాలను ఎలా అరికట్టారు అన్నది కధాంశం. డైరెక్టర్ సమీర్ ఈ సబ్జెక్ట్ ను ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసారు. ఆడియన్స్ కు ఎక్కడా బోర్ అనేది కలగకుండా ప్రతి సీన్ ను ఎంతో అందంగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి.

సెప్టెంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. చక్కని కధ, కధనాలతో సాగే ఈ చిత్రం తెలుగులోను మంచి విజయం సాధించి మాకు మా బేనర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు. కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు- వెంకట్, సంగీతం- మనిష, నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి, కథ స్ర్కీన్-ప్లే దర్శకత్వం- సమీర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X