'విశ్వరూపం' డీటీహెచ్‌ విడుదల తేదీ ఖరారు

By Srikanya

చెన్నై: కమల్‌హాసన్‌ తన భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వరూపం' డీటీహెచ్‌లో ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలియచేసారు. అంతకన్నా ఒక వారం ముందుగానే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో థియేటర్‌లలో విడుదలవుతోంది. చిత్రం హిందీ వర్షన్‌ ఉత్తరాదిన ఫిబ్రవరి ఒకటిన, థియేటర్లలో ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లు కమల్‌ హాసన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్రం విడుదల ఆలస్యం అయినందుకు ఓపికగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన క్షమాపణలు తెలియచేసారు.కమల్‌హాసన్‌ 'విశ్వరూపం' పేరుకు తగ్గట్టే ఆకారం దాల్చుతోంది. సినిమాను డీటీహెచ్‌లో విడుదల చేయనున్నట్లు కమల్‌ ప్రకటించారు. దీనిపై థియేటర్‌ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే థియేటర్లు మూసేసుకుని వీధిన పడాల్సిందేనని అంటున్నారు. ఈ విషయమై కమల్ సీరియస్ గా స్పందించారు.

అలాగే ఇది స్వతంత్ర భారతదేశం. నా ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. 'విశ్వరూపం' నా వస్తువు. దాన్ని న్యాయపరంగా ఎలాగైనా విడుదల చేసుకుంటా. అయితే థియేటర్‌ వారికి ఎలాంటి భయం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. నాకు దాహం వేసింది. వెళుతూ ఉంటే నీటిగుంట కనిపించింది. దోసిటితో తాగా. దప్పిక తీరింది. ఆ నీటిని నాలాంటి వారు ఎవరైనా తాగొచ్చు. నీటిగుంట వద్దని చెప్పదు! ఇంత డబ్బు తీసుకుని కమల్‌ ఏం చేయబోతున్నాడు అని అందరూ అడుగుతున్నారు. నేను శివాజి అభిమానిని. ఆయనకు సొంతంగా థియేటర్‌ ఉంది. మరి నాకు..? అందుకే ఈ 'డీటీహెచ్‌ డబ్బు'తో థియేటర్‌ కడతా అన్నారు.

కమల్‌ తన స్వీయ నిర్మాణంలో రూ.95 కోట్లు వెచ్చించి బ్రహ్మాండంగా 'విశ్వరూపం' తెరకెక్కించారు. పూజ, ఆండ్రియా హీరోయిన్స్ . ప్రారంభం నుంచే అన్ని చిత్రపరిశ్రమలు దీనివైపు ప్రత్యేక దృష్టి సారించాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించారని బాలచందర్‌, బాలుమహేంద్ర, భారతిరాజా వంటి దర్శకులు చెప్పడంతో దేశంలో ఆసక్తి రెట్టింపైంది.

థియేటర్‌ యజమానులకు ప్రత్యేకించి కమల్‌ పలుమార్లు'భయపడాల్సిన అవసరం లేద'ని భరోసా ఇచ్చారు. అంతేకాక ఒకవేళ ఫలితం తారుమారైతే తన ఆపన్న హస్తం ఉంటుందని కొందరు పంపిణీదారులకు చెప్పినట్లు సమాచారం. ఎన్ని చెప్పినా థియేటర్‌ యజమానుల సంఘం మాత్రం చిత్రాన్ని బహిష్కరించింది. ఇకపై కమల్‌కు సహకరించమని తేల్చిచెప్పింది. కమల్‌ తన దారి తాను చూసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X