Ponniyin Selvan 2:ట్రైలర్ లాంచ్ లో మంత్రి సంచలన కామెంట్స్.. PS 2ను నిర్మించవద్దని ముందే చెప్పాను అంటూ..

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇప్పటికే మొదటి భాగానికి మంచి గుర్తింపు అందగా ఇప్పుడు రెండవ భాగాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక బుధవారం రోజు చెన్నైలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ వేడుకలో తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్ కూడా పాల్గొన్నారు. అయితే ఆయన ఊహించని విధంగా "పొన్నియిన్ సెల్వన్"ని సినిమాగా తీయవద్దని చిత్ర నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజాకు అప్పట్లో సలహా ఇచ్చినట్లుగా మాట్లాడారు. "పొన్నియిన్ సెల్వన్ 2" ట్రైలర్ లాంచ్‌లో దురై మురుగన్ మాట్లాడుతూ.. ఈ క్లాసిక్‌ని సినిమాగా తీయడం సాధ్యం కాదని, తమిళ సినిమాకు సమర్థులైన నటులు లేరని తాను అల్లిరాజాతో చెప్పానని అన్నారు.

Durai Murugan Congratulates Producer of Ponniyin Selvan Film Despite Initial Advice

అయితే అటువంటి మాటలను పట్టించుకోకుండా అల్లిరాజా PS 2ను నమ్మకంతో ఫ్యాషన్ తో ఎంతో సమర్థవంతంగా తెరపైకి తీసుకు వచ్చాడు. మొదటి భాగాన్ని అద్భుతంగా నిర్మించాడు, ఇది భారీ విజయాన్ని సాధించింది, ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్లను సంపాదించింది. నటీనటులు కూడా అద్భుతమైన నటనతో మెప్పించారు అని అన్నారు.

దురై మురుగన్ మొత్తానికి ఈ చిత్రాన్ని రూపొందించినందుకు అల్లిరాజాను అభినందించారు. చిత్ర దర్శకుడు మణిరత్నంకి అభిభివందనం చేశారు. ఈ సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం మరింత విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్. అలగ్వ సిలమబరసన్ సహా తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నటీనటులు విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళతో సహా "పొన్నియిన్ సెల్వన్ 2" సిబ్బంది కూడా హాజరయ్యారు. మణిరత్నం, అల్లిరాజా సమక్షంలో కమల్‌హాసన్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X