»   » తమిళ సినిమాలో క్రికెటర్ డ్వేన్ బ్రావో

తమిళ సినిమాలో క్రికెటర్ డ్వేన్ బ్రావో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dwayne Bravo
చెన్నై: వెస్టిండీస్ క్రికెటర్ త్వరలో ఓ తమిళ సినిమాలో కనిపించబోతున్నాడు. 'ఉల'(Ula) పేరుతో రూపొందబోయే ఈచిత్రానికి రాజన్ మాధవ్ దర్శకత్వం వహించనున్నాడు. వెస్టర్న్ బీట్లో సాగే ఓ సాంగులో బ్రావోతో స్టెప్పులు వేయించనున్నాడట దర్శకుడు. సినిమాకు హైప్ తెచ్చేందుకే ప్రయోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

డ్వేన్ బ్రావో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా....స్టేడియలో తన డాన్స్ స్టెప్పులతో అభిమానులను అలరించడం చాలా సార్లు చూసాం. ఈ క్రమంలోనే దర్శకుడు రాజన్ మాధవ్ కన్ను బ్రావోపై పడింది. ఈ మేరకు అతన్ని సంప్రదించి సినిమాలోని సాంగులో నటించేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

'ఉల' సినిమా విషయానికొస్తే....ఇదొక థ్రిల్లర్ మూవీ. 48 గంటల్లో సాగే నాలుగు డిఫరెంటు స్టోరీల చుట్టూ కథ తిరుగుతుంది. సరికొత్త కథాంశం, స్ర్కీన్ ప్లేతో ఆద్యంతం ఆసక్తిగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు చిత్ర దర్శకుడు రాజన్ మాధవ్. యూత్‌కు నచ్చేలా వినోదాత్మకంగా సినిమా ఉంటుంది.

ఈ చిత్రంలో అజ్మల్, రాధిక ఆప్టే, విధార్థ్, గ్వాతెరి శంకర్, అశోక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాజన్ మాధవ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బేనర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Ula is the upcoming Tamil movie being directed by Rajan Madhav of Muran fame. West Indies cricketer Dwayne Bravo is been roped in by Rajan’s Ula team to do a western number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu