ఇండియన్ 2 సినిమాపై ఈ సేవ కేసు.. అసలే కలెక్షన్లు లేవంటే శంకర్‌కు మరో దెబ్బ!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర అందులోని సౌత్ ఇండియా సినిమా నుంచి అయితే పాన్ ఇండియా లెవెల్ చిత్రాలు ఒకింత తక్కువే వచ్చాయని చెప్పాలి. ఎప్పుడో జనవరిలో మొదలు పెడితే మళ్ళీ ఓ సరైన పాన్ ఇండియా సినిమా రావడానికి జున్ వరకు ఆగాల్సి వచ్చింది. అలా జూన్ లో ప్రెజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన భారీ చిత్రం "కల్కి 2898 ఎడి" రిలీజ్ కి వస్తే ఈ చిత్రం ఇప్పుడు భారీ లెవెల్లో వసూళ్లు కొల్లగొడుతూ మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు సినిమా నుంచి 1000 కోట్ల గ్రాసర్ గా నిలిచింది.

కాగా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ మళ్ళీ థియేటర్స్ లోకి ఎగబడి వస్తుండడంతో ఇతర సినిమాలు కూడా వచ్చాయి. అలా ఈ సినిమా తర్వాత వచ్చిన మరో అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే "భారతీయుడు 2". దర్శకుడు శంకర్ అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ఎవెర్ గ్రీన్ సోషల్ డ్రామా చిత్రం భారతీయుడు కి సీక్వెల్ గా వచ్చింది.

E Sewa files Complaint on Aadhar Cards scenes kamal haasan s indian 2 which already struggling at boxoffice

కాగా ఒరిజినల్ తమిళ్ లో "ఇండియన్" పేరిట వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. అప్పట్లో 96 లోనే ఈ చిత్రం 60 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని చరిత్ర సృష్టించింది. కానీ ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వచ్చిన ఇండియన్ 2 మాత్రం దారుణంగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పాలి. సినిమా వచ్చి 5 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో ఈ చిత్రం ఇంకా 100 కోట్ల మార్క్ ని అందుకోనట్టు తెలుస్తుంది.

కాగా ఇంత డిజాస్టరస్ రన్ ని పొంది స్ట్రగుల్ అవుతున్న ఈ చిత్రానికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరో షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది కాగా అసలు మేటర్ ఏమిటంటే ఈ సినిమాలో శంకర్ కొన్ని సీన్స్ ని ప్రభుత్వానికి సంబంధించిన శాఖలపై నేరుగానే పేర్లు పెట్టి అవినీతి చేస్తున్నారని చూపించేసారు. అలా అందులో ఈ సేవ పై కూడా కొన్ని సీన్స్ చూపించి శంకర్ సెటైర్స్ వేశారు.

E Sewa files Complaint on Aadhar Cards scenes kamal haasan s indian 2 which already struggling at boxoffice

దీనితో ఇప్పుడు నిజమైన ఈ సేవ బృందం వారు ఇండియన్ 2 సినిమాపై కేసు వేసినట్టుగా తెలుస్తుంది. తమపై అనుచిత సన్నివేశాలు ఈ సినిమాలో చిత్రాకరించారు అని ఆ పూర్తి సన్నివేశాలు తప్పకుండా సినిమా నుంచి శంకర్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికే వసూళ్లు లేని ఈ సినిమాపై ఇప్పుడు సరికొత్త కాంట్రవర్సీలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్టు అయ్యిందని చెప్పాలి.

ప్రస్తుతానికి అయితే దర్శకుడు శంకర్ టైం మాత్రం అస్సలు బాగోలేదనే చెప్పుకోవాలి. ఆల్రెడీ సినిమాలో 12 నిమిషాలు కట్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఇప్పుడు ఇదో ఎక్స్ట్రా అని చెప్పుకోవాలి. మరి ఈ విషయంపై అయితే ఇండియన్ 2 యూనిట్ ఏమన్నా స్పందిస్తుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రంలో యువ హీరో సిద్ధార్థ్ కూడా ముఖ్య పాత్ర చేయగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ తదితరులు నటించారు. అలాగే ఈ చిత్రానికి శంకర్ మూడో సినిమాని కూడా ప్లాన్ చేసి కూర్చున్నారు. మరి దాని పరిస్థితి ఏంటో వారికే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X