పది సంవత్సరాల తర్వాత తెలుగులో సినిమా తీస్తున్నమామగారు నిర్మాత
మామగారు, బావ బావమరిది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడైన ఎడిటర్ మోహన్ తెలుగులో మళ్ళి సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. పది సంవత్సరాల క్రితం 2001 లో 'హనుమాన్ జంక్షన్' ఆయన నిర్మించిన చివరి తెలుగు చిత్రం. ఆ తరవాత ఇప్పటి వరుకు తమిళ సినిమాల నిర్మాణంలో తలమునకలై ఉన్నారు.
ఎడిటర్ మోహన్ కుమారుడు 'జయం' రవి హీరోగా తమిళంలో మంచి ఫామ్ లో ఉండటంతో అతనితో సినిమాలు చేయటంలో బిజీగా ఉన్నారు. ఫైగా తెలుగులో హిట్ అయిన సినిమాలను పెద్ద కొడుకు రాజా దర్శకత్వంలో చిన్న కొడుకు హీరోగా వరసగా రీమేక్ లు చేస్తూనే వచ్చారు. ఇన్నాళ్ళకు తమిళ సినిమా 'ముతుకు ముతగా' ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ చిత్రానికి సంబందించిన హక్కులను సొంతం చేసుకున్న మోహన్ నటినటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











