»   » భారతీయ తొలి 3డీ మూవీ ఎడిటర్ శేఖర్ కన్నుమూత

భారతీయ తొలి 3డీ మూవీ ఎడిటర్ శేఖర్ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ ఎడిటర్ టీఆర్ శేఖర్(81) కన్నమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. దక్షిణాది సినీ పరిశ్రమకు దాదాపు 50 ఏళ్ల పాటు సేవలు అందించిన ఆయన 200కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.

తొలి భారతీయ 3డీ ఫిల్మ్ 'మైడియర్‌ కుట్టిసాత్తాన్‌' చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన ఆయన రికార్డులకెక్కారు. దీంతో పాటు సౌత్ తొలి సినిమాస్కోప్‌ (తస్సోలి అంబు), తొలి 70ఎంఎం (పడైయోట్టం) చిత్రానికి ఎడిటర్‌గా చేశారు.

Editor TR Sekhar, dies at 81

టీఆర్ శేఖర్ తన కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 'వరుషం 16' చిత్రానికి గానూ శేఖర్‌ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎడిటర్‌ అవార్డును, '0 మొదల్‌ 1 వరై' అనే మలయాళ చిత్రానికి కేరళ రాష్ట్రం నుంచి ఉత్తమ ఎడిటర్‌ అవార్డు అందుకున్నారు.

తన కెరీర్లో ఆయన చివరిగా తమిళ చిత్రం 'సాదుమిరండా' చిత్రానికి పని చేశారు. సినిమా రంగం నుండి రిటైర్మెంటు తీసుకున్న తర్వాత ఆయన తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. ఈయనకు భార్య సుందరి, కుమార్తెలు దీపలక్ష్మి, తిలకవతి, నిత్యా ఉన్నారు.

English summary
The veteran had many firsts to his credit. He was the editor of the first ever cinemascope film in Malayalam, Thacholi Ambu (1978), of India’s first 70mm film Padayottam (1982) and of the first Indian 3D film, My Dear Kuttichathan (1984).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X