రాజమౌళి 'ఈగ' రిలీజ్ డేట్ ఖరారు
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'రిలీజ్,ఆడియో విడుదల డేట్స్ ఫిక్స్ చేసారు. మార్చి 22న ఈగ తెలుగు వెర్షన్ ఆడియోను, మార్చి 25న తమిళ వెర్షన్ ఆడియోను విడుదల చేసాతుర. అలాగే ఏప్రియల్ 25న చిత్రాన్ని విడుదల చేయటానికి డేట్స్ ఫిక్స్ చేసినట్లు నిర్మాతలు చెప్తున్నారు. ఈగ తమిళ వెర్షన్ ప్రమోషన్ నిమిత్తం చెన్నై వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేసి రాజమౌళి ఈ వివరాలను తెలియచేసారు.
ఇక ఈ చిత్రం కథ గురించి చెపుతూ...అనగనగా ఓ ఈగ. ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయింది. ఎంత తలచుకొన్నా గుర్తుకు రాలేదు. అందర్నీ అడిగింది. అందరూ వెకిలిగా ఓ నవ్వు నవ్వినవారే. చివరికి చీమ 'ఈ..ఈ..' అంటూ ఓ హింటు ఇచ్చింది. అప్పుడు 'నా పేరు ఈగ కదూ..' అని తెలుసుకొంటుంది. ఒకటో తరగతిలో చదువుకొన్న సరదా కథ ఇది. అయితే ఇక్కడ ఇంకో ఈగ ఉంది. తనకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏదీ తేలిగ్గా మర్చిపోయే రకం కాదు. అందుకే గత జన్మలో పగ కూడా గుర్తుకు తెచ్చుకొంది. మరి ప్రతీకారం ఎలా తీర్చుకొందో తెలియాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే అన్నారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ''బలవంతుడైన మనిషికీ, అల్పప్రాణి ఈగకూ మధ్య జరిగిన పోరాటం ఇది. నాని, సమంత, సుదీప్ ముగ్గురూ ఈ కథని బాగా అర్థం చేసుకొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం. 24న తమిళ పాటలు ఆవిష్కరిస్తామని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కళ: రవీందర్, సమర్పణ: డి.సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











