twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఈగ'కి తమిళనాడులో అన్ని ధియోటర్లా?

    By Srikanya
    |

    'ఈగ' చిత్రాన్ని తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బారీగా విడుదల చేస్తున్నారు. మూడు వందల ధియోటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటం అక్కడ అందరికీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అంటున్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా నిర్మిస్తోంది.

    ఇక రాజమౌళి ఈగని బైలింగ్వల్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మీడియాలో ఈగ చిత్రాన్ని నాన్ ఈ అనే టైటిల్ తో తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ మాట్లాడారు.ఆయన మాటల్లోనే...ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు,తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించాము. నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు. అది బైలిగ్వల్. ఇక హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాము. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర జరుపుకుంటోంది. ఈ 30న విడుదల చేస్తాము అన్నారు.

    సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు.

    అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ' ఈగ' కథాంశం.

    English summary
    Rajamouli had conquered one more frontier too. His latest movie Eega has stirred huge interest among the common audience in Tamil Nadu. The movie is reportedly getting huge offers from all the areas and is now releasing in as many as 300 theaters in Tamil Nadu. PVR cinemas which had bought the Tamil rights of the movie for 5 crore, had stricken gold by collecting 3.35 crore in the form of TV rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X