‘ఈగ’తమిళ వెర్షన్ ఎంత వసూలు చేసింది?
చెన్నై: రాజమౌళి లేటెస్ట్ చిత్రం 'ఈగ' ఆగస్టు 24 వ తేదికి రిలీజై సరిగ్గా యాభై రోజులు పూర్తైన సంగతి తెలిసిందే. తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తమిళంలోనూ తమింళంలో 'నాన్ ఈ'టైటిల్ తో విడుదల అయ్యింది. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా హక్కులు తీసుకుని విడుదల చేసింది. అక్కడ కలెక్షన్స్ చూస్తే..దాదాపు పాతిక కోట్లు వరకూ వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభం చేకూర్చిందని చెప్తున్నారు.
త్వరలో ఈచిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది. అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున....బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది.
సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించింది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందించారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.


Click it and Unblock the Notifications











