‘ఈనాడు’ విశేషాలు
హిందీలో సెన్సేషనల్ హిట్ అయిన 'వెడ్నెస్ డే" చిత్రం ఆధారంగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై జాతీయ నటుడు కమల్ హాసన్ నిర్మించిన 'ఈనాడు" సెప్టెంబర్ 18 విడుదలవుతుంది. ఈనాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందంటున్నారు. యూనివర్శల్ హీరో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ భారీ చిత్రాన్ని తెలుగులో హక్కుల్ని అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత జి. కుమార్ బాబు పొందారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కమల్ హాసన్, వెంకటేష్ లాంటి అగ్రహీరోలు నటించిన భారీ చిత్రం 'ఈనాడు" ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం ఎంతో థ్రిల్ గా ఫీల్ అవుతున్నమన్నారు. కమల్ హాసన్ గారి కుమార్తె శృతిహాసన్ ఈ చిత్రానికి ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ చేయడంతో కమల్ హాసన్, వెంకటేష్ ల నటన హైలైట్ గా 'ఈనాడు" తయారయిందంటున్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ వెడ్నెస్ డే చిత్రం చూసి ఎంతో ఇన్ స్పైర్ అయ్యి, నా స్వంత బేనర్ లో ఈ చిత్రాన్ని నిర్మించాను. నా కెరీర్ లో ఇది మరో సెన్షేనల్ ఫిలిమ్ అవుతుంది. వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా చాలా ముఖ్యమైన రోల్ చేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 'సినిమా పట్ల అంకిత భావంతో వర్క్ చేసే గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. 'ఈనాడు' ఓ పవర్ ఫుల్, పర్ఫస్ ఫుల్ ఫిలిమ్. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్నారు. దర్శకుడు చక్రి తోలేటి 'ఈనాడు"ను అద్భుతంగా తీసారు. దశావతారం తర్వాత ఈనాడు నాకు మరో విభిన్నమైన చిత్రంగా అన్నివిధాలా సంతృప్తిని కలిగిస్తోంది అన్నారు.ఈ నెల 29న కమల్ హాసన్, వెంకటేష్ లతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో 'ఈనాడు" లోగోని ఆవిష్కరిస్తామని తెలిపారు. సెప్టంబర్ ఫస్ట్ వీక్లో ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసాం అన్నారు.


Click it and Unblock the Notifications











