సెప్టంబర్ లో ‘ఈనాడు’
రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ యూటీవీతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'ఈనాడు". హిందీ 'వెడ్నెస్ డే" ఆధారంతో రూపొందుతున్న చిత్రం. తెలుగులో కమల్ హాసన్, వెంకటేష్ ప్రధాన పాత్రధారులు. తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్" అనే పేరుతో రూపొందుతోంది. తెలుగులో వెంకీ పాత్రను తమిళంలో మోహన్ లాల్ పోషించారు. 'ఈనాడు" ను తెలుగులో విడుదల చేసే హక్కులను అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ పొందింది. ఈ సంస్థ తరపున జి.కుమార్ బాబు ఈ విషయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కమల్ హాసన్, చంద్రహాసన్, వెంకటేష్ లు చేసిన కోఆపరేషన్ కి ప్రత్యేక కతజలు తెలిపారు. ఆడియో రీలీజ్ ను ఈ నెల చివరన విడుదల చేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెల 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాకు చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు.
More from Filmibeat
eenadu kamal hassan venkatesh wednesday unnaipol oruvan amma art creations kumarbabu chakri tholeti ఈనాడు కమల్ హాసన్ వెంకటేష్ ఉన్నైపోల్ ఒరువన్ మోహన్ లాల్ అమ్మ ఆర్ట్ క్రియేషన్స్


Click it and Unblock the Notifications











