విశాల్ బర్త్ డే సందడి షురూ.. అందమైన హీరోయిన్ల చేత సీడీపీ

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అనే అంశం బాగా పాపులర్ అయింది. ఏదైనా ఓ విషయాన్ని అందరికీ తెలిసేట్టుగా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు ట్వీట్ల యుద్దాన్ని చేపడుతున్నారు. ఇక హీరోల ఫ్యాన్స్ అయితే ఇదే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. హీరోల సినిమాలు, బర్త్ డేలు, కామన్ డీపీలు అంటూ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో సత్తాను చాటేందుకు ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నాలు చేపడుతున్నారు.

ఈ మధ్యే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దళపతి విజయ్, ఎన్టీఆర్, అజిత్ ఫ్యాన్స్ ఎంతగా రచ్చ చేశారో అందరకి తెలిసిందే. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ 61 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తే.. అడ్వాన్స్ బర్త్ డే పేరిట ఆ రికార్డ్‌ను పవన్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారు. ఇలా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చాటుకునేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు.

Eesha Rebba And Pranitha Releases Vishal Birthday CDP

తాజాగా విశాల్ బర్త్ డే(ఆగస్ట్ 29) సెలెబ్రేషన్స్‌కు రంగం సిద్దమైంది. విశాల్ బర్త్ డే కామన్ డీపీ నేటి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ సీడీపీని ఈషా రెబ్బా, ప్రణీత, దర్శకులు లింగుస్వామి, ప్రభాకర్ సంయుక్తంగా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక విశాల్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య తన ఆఫీస్‌లో పనిచేసే మహిళా ఉద్యోగి విషయంలో ఆపై కరోనా జాగ్రత్తలు చెబుతూ వదిలిన వీడియోలతో బాగా వైరల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X