45 కోట్ల బడ్జెట్ తో 'మగధీర'కు పోటీగా..

By Srikanya

తమిళ, తెలుగు పరిశ్రమలను ఉక్కిరిబిక్కిరి చేసిన కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసిన చిత్రం మగధీర.ఇప్పుడు ఆ చిత్రానికి పోటీనా అన్నట్లు తమిళంలో 'అరవాన్"చిత్రం రూపొందుతోంది.దాదాపు 45 కోట్ల భారీ బడ్జెట్‌తో దాదాపు 160 రోజుల పాటు ఏకధాటిగా బొబ్బిలి, గండికోట, కర్నూలు, తలకోన ఫారెస్ట్, హంపి తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి అక్కడ పత్రికలు మగధీర తో పోల్చి రాస్తున్నాయి.ఆది పినిశెట్టి, దన్సిక, అంజలి కాంబినేషన్‌లో వసంతబాలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రం ఓ రేంజి చిత్రంగా అభివర్ణిస్తున్నారు.ఈ చిత్రాన్ని 'ఏకవీర" పేరుతో నిర్మాత శ్రీనివాస్ దామెర తెలుగులోకి అనువదిస్తున్నారు.

300 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని నిర్మాత చెప్పారు. ఇంకా మాట్లాడుతూ -''ఆ తరాన్ని గుర్తు చేస్తూ నేటి తరాన్ని సైతం ఆకర్షించేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.
ఇందులోని పోరాట సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి.18వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనను, మహా భారతంలో అర్జునుడు, ఉలూచిక (నాగకన్య)కు పుట్టిన ఐరావంతుడు కథను స్ఫూర్తిగా తీసుకుని నాటి వేషధారణతో అప్పటి వాతావరణాన్ని స్ఫురింపజేస్తూ ఒక అద్భుత దృశ్యకావ్యంలా దర్శకుడు వసంతబాలన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు.

భారీ సెట్టింగ్స్‌తో నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ గాయకుడు కార్తీక్‌ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమవ్ఞతున్నాడు. ఆది నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు. అర్చన కవి, శ్వేతా మీనన్‌, విజయచందర్‌, పశుపతి, కరికాలన్‌, శృతి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్‌, కెమెరా: సిద్ధార్థ్‌. ఈ చిత్రానికి సమర్పణ:అమ్మ క్రియేషన్స్ టి.శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X