ఆఫర్లు ఇస్తామని వాడుకొన్నారు.. ముఖం చాటేసి డైరెక్టర్లు మోసం.. తెరపైకి మరో శ్రీరెడ్డి

ప్రపంచ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం బలంగా ప్రభావం చూపించడంతో సినీ తారలపై లైంగిక వేధింపులు తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపించింది. ఆ ప్రభావంతో సినీ, టెలివిజన్ రంగాల్లో మహిళలు ధైర్యంగా ఉండగలుగుతున్నారనే వాదన వ్యక్తమైంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తనను లైంగికంగా వేధించారని వర్ధమాన శృంగార తార, టిక్ టాక్ సెలబ్రిటీ ఎలాకియా ఆరోపణలు చేయడంతో మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

టిక్ టాక్‌లో పాపులారిటీ

టిక్ టాక్‌లో పాపులారిటీ

టిక్ టాక్ యాప్‌లో సంచలనం సృష్టిస్తూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను తమిళ అమ్మాయి ఎలాక్కియా సంపాదించుకొన్నది. అర్ధనగ్నంగా కనిపిస్తూ, అసభ్యకరమైన సెల్ఫీలతో ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అయితే టిక్‌టాక్‌లో వచ్చిన ఫాలోయింగ్ కారణంగా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

 శారీరకంగా వాడుకొని

శారీరకంగా వాడుకొని

అయితే తమిళ సినీ పరిశ్రమలో తనకు ఆఫర్లు ఇస్తామని చెప్పి తనను శారీరకంగా వాడుకొన్నారు అని ఎలాక్కియా సంచలన ఆరోపణలు చేసింది. ఆఫర్ల పేరుతో తనను మోసగించారని, అవసరాలు తీర్చుకొన్న తర్వాత కొందరు డైరెక్టర్లు ముఖం చాటేస్తున్నారని ఆమె ఆరోపణలను గుప్పించింది. ఇలా చాలా మంది తనకు అన్యాయం చేశారు. సెక్స్‌లో పాల్గొంటేనే ఆఫర్లు ఇస్తామని అంటున్నారు అని ఆమె పేర్కొన్నది.

తమిళ చిత్ర ప్రముఖులపై ఆరోపణలు

తమిళ చిత్ర ప్రముఖులపై ఆరోపణలు

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ చిత్ర ప్రముఖులపై దుమ్మెత్తి పోసింది. పడకగదిలో సుఖం కల్పిస్తేనే అవకాశాలు, ఆఫర్లు (క్యాస్టింగ్ కౌచ్) ఇస్తామని అంటున్నారని బాహాటంగా కొందరు డైరెక్టర్లపై విమర్శలు గుప్పించింది. ఇలాంటి మోసాలకు గురికాకుండా యువ ఔత్సాహిక తారలను కాపాడేందుకే ఇలా బహిరంగంగా కొందరి జాతకాలను బయటపెట్టాలనుకొంటున్నాను అని చెప్పింది.

Recommended Video

Shivan Movie Hero Sai Teja Kalvakota Interview Part 3
శ్రీరెడ్డి తరహాలోనే

శ్రీరెడ్డి తరహాలోనే

టిక్ టాక్‌తో మంచి ఆదరణ కూడగట్టుకొన్న ఎలాక్కియా తాజాగా యోగిబాబు హీరోగా నటించిన జోంబి చిత్రంలో కనిపించింది. అయితే ఈమె చేస్తున్న హంగామా చూస్తుంటే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి గుర్తుకు వస్తుందనే మాటను సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీరెడ్డి కూడా ఆఫర్లు ఇస్తానని మోసం చేశారని ఆరోపణలు సంధించడం తెలిసిందే. శ్రీరెడ్డి స్ఫూర్తితోనే ఎలాక్కియా మీటూ ఉద్యమాన్ని చేపట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X