విశాల్ పెళ్లిపై ఆ ప్రచారం నిజం కాదా? అనిషా రెడ్డి ఇన్‌స్టా స్టోరీ హాట్ టాపిక్!
తమిళ నటుడు విశాల్ గురువారం(ఆగస్టు 29) 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీరంగానికి చెందిన ప్రముఖులు ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా
ఫ్యాన్స్ తమిళనాడులో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం.
Recommended Video
కాగా... కొన్ని రోజుల క్రితం విశాల్ పెళ్లి విషయంలో షాకింగ్ రూమర్స్ వినిపించాయి. అనిషా రెడ్డితో అతడి వివాహం రద్దయినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. ఆమె తన సోషల్ మీడియా పేజీ నుంచి విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలు తొలగించడమే అందుకు కారణం. దీనికి తోడు పెళ్లి రద్దయినట్లు వచ్చిన రూమర్లపై స్పందించక ఇద్దరూ స్పందించక పోవడంతో ఆ న్యూస్ మరింత బలపడింది.

విశాల్ బర్త్ డే సందర్భంగా విష్ చేసిన అనిషా
అయితే విశాల్ బర్త్ డే సందర్భంగా అతడిని విష్ చేస్తూ అనిషా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇద్దరూ విడిపోయినట్లు, వివాహం రద్దయినట్లు వార్తలు వచ్చిన తర్వాత ఆమె విషెస్ తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇద్దరి మధ్య రిలేషన్ బావున్నట్లేనా?
విశాల్‌ను విష్ చేస్తూ అనీషా పోస్ట్ పెట్టడంతో ఇద్దరి మధ్య రిలేషన్ బానే ఉందనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇటు విశాల్ కానీ, అటు అనీషా కానీ రూమర్లపై స్పందించక పోవడం, ఫోటోలు తొలగించడానికి కారణం ఏమిటనే విషయంలో క్లారిటీ ఇవ్వక పోవడంలో అభిమానులు ఇంకా కన్‌ఫ్యూజన్లోనే ఉన్నారు.

అనిషా రెడ్డి తన పోస్టులో ఏం పెట్టారంటే?
"హ్యాపీ బర్త్ డే స్టార్... నక్షత్రంలా వెలుగొందడానికే మీరు జన్మించారు. ఎప్పటికీ నేను మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాను. మీ దారిలోనే గొప్పదనం ఉంది డియర్, నాకు విశ్వాసం ఉంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను" అని అనిషా రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.

అదే తేదీన పెళ్లి జరుగుతుందా?
మార్చిలో అనిషా, విశాల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న చెన్నైలో పెళ్లి ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తు వచ్చాయి. అయితే ఇంకా శుభలేఖలు అయితే రాలేదు. ఈ తేదీలో మార్పు కూడా ఉండొచ్చనే వాదన కూడా ఉంది. విశాల్ సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన ‘అయోగ్య' ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో ‘యాక్షన్' అనే చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











