Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
హీరోయిన్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్.. వెంటాడి మరీ, అక్కడ పట్టుకున్న పోలీసులు!
తనను శారీరకంగా వాడుకుని గర్భవతి అయ్యాక గర్భం తీయించి మొహం చాటేశాడు అని చెబుతూ తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ ఒక రాజకీయ నేత, మాజీ మంత్రి మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వ్యవహారంలో తాజాగా మాజీ మంత్రి అరెస్ట్ అవ్వడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
ప్రేమ, పెళ్లి పేరుతో
తమిళ సినీ ఇండస్ట్రీలో యువ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చాందిని ఇప్పుడిప్పుడే అవకాశాలతో మంచి పేరు తెచ్చుకుంటోంది. అయితే ఈమె సినిమాల పరంగా ఫేమస్ అవ్వడం కంటే ముందు తనను ఒక రాజకీయ నేత లైంగికంగా వేధింపులకు గురిచేసి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకొని గర్భవతిని చేశాడంటూ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
సంచలన ఆరోపణలు
మలేషియా నుంచి వచ్చిన తనను అప్పట్లో మంత్రిగా ఉన్న మణికందన్ ప్రేమ పేరుతో దగ్గరై లైంగికంగా తన వాడుకున్నాడని తనతో ఐదేళ్ళ పాటు సహజీవనం చేసి గర్భవతిని కూడా చేశాడు అని చాందిని పేర్కొంది. గర్భవతిని చేయడమే కాక గర్భస్రావానికి కూడా పాల్పడ్డారని ఇప్పుడు ప్రశ్నిస్తున్న తనను చంపడానికి మనుషులను సైతం ఏర్పాటు చేశారు అని చెబుతూ ఆమె కోర్టుకు ఎక్కింది.
ముందస్తు బెయిల్ కోసం వెళితే
ఈ క్రమంలో హీరోయిన్ మీద అత్యాచారం పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మణికందన్ ను తమిళనాడు పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. చాందినికి అబార్షన్ చేయించడంతో పాటు హత్య చేయించడానికి ప్రయత్నించారనే ఆరోపణపై కేసు నమోదయింది. ఈ కేసులో మణికందన్ మద్రాస్ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం సంప్రదించారు.
బెంగళూరులో ఉండగా
అయితే ఈ కేసును హైకోర్టు తోసి పుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ లాంటివి ఇవ్వకూడదని సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందని చెబుతూ బెయిల్ కేసును కొట్టేసింది. బుధవారం నాడు కోర్టు ఈ కేసును కొట్టి వేయగా అప్పటి నుంచి పోలీసులు వేటాడితే చివరికి ఆయన బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు.
సినిమాల కోసం మలేషియా నుంచి
దీంతో ఆయనను బెంగళూరులో అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు తిరిగి చెన్నైకి తీసుకెళ్లారు. ఇక మలేషియాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించిన చాందిని తమిళ సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలని భావిస్తూ చెన్నై చేరారు. ఇప్పటికే ఒక సినిమా హీరోయిన్ గా చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇక ప్రస్తుతం పబ్జి అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సినిమాల్లో వచ్చిన పాపులారిటీ కంటే ఆమె మాజీ మంత్రి మోసం చేసిన మహిళగా తమిళనాడులో అందరికీ ఇప్పుడు పరిచయమయ్యారు.