తండ్రి అయిన అమలా పాల్ మాజీ భర్త.. సంతోషంలో విజయ్ ఫ్యామిలీ

అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు విజయ్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఆయన అన్న నటుడు ఉదయ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశాడు. అమలాపాల్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల ఘట్టం ముగిసిన తరువాత విజయ్ మరో వివాహాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న విజయ్ ప్రస్తుతం తండ్రి అయ్యాడు. వీరిద్దరికి నేటి ఉదయం పండంటి మగ బిడ్డ పుట్టినట్టు తెలుస్తోంది.

ప్రేమ, పెళ్లి, విడాకులు..

ప్రేమ, పెళ్లి, విడాకులు..


అమలాపాల్‌తో ప్రేమ వ్యవహారం సాగించిన దర్శకుడు.. 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మూడేళ్ల పచ్చని కాపురంలో చిచ్చు మొదలైంది. కుటుంబ అంతర్గత కలహాలతో ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్న ఈ ఇద్దరు ప్రస్తుతం స్నేహితులుగా ఉంటున్నారు.

మరో పెళ్లి చేసుకున్న విజయ్..

మరో పెళ్లి చేసుకున్న విజయ్..

అమలా పాల్‌తో విడాకుల అనంతరం ఇంట్లో వారి ఒత్తిడి మేరకు విజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు చూసిన అమ్మాయి డాక్టర్ ఐశ్వర్యను విజయ్ వివాహం చేసుకున్నాడు. అయితే అమలాపాల్ మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంది. అయిత ఆమె రెండో పెళ్లిపై పుకార్లు వస్తున్నాయి.

అప్పట్లో వార్తలు వైరల్..

అప్పట్లో వార్తలు వైరల్..


ఆ మధ్య విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎంతగానో వైరల్ అయ్యాయి. విజయ్, అమలాపాల్ విడిపోవడానికి హీరో ధనుష్ కారణమని చెప్పడం, ఆ ఆరోపణలను అమలాపాల్ ఖండించడం ఇలా ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ హల్చల్ చేశాయి.

Recommended Video

Akkineni Nagarjuna Reveals About His First Kiss , Crush And Love
తండ్రి అయిన దర్శకుడు..

తండ్రి అయిన దర్శకుడు..


విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ‘నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం 11.25 గంటల సమయంలో విజయ్‌, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X